
టాలీవుడ్ నటి మీనాక్షి చౌదరి తన కెరీర్ గురించి, రాబోయే చిత్రాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరలో తన పాత్ర ఎంతో ప్రత్యేకమని, అది తన జీవితంలో ఓ స్పెషల్ చాప్టర్ అవుతుందని ఆమె నమ్ముతున్నారు. పాత్రల ఎంపిక, రూమర్స్ పై కూడా స్పందించారు.
Key Points
మీనాక్షి చౌదరి ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరలో తాను భాగమని మీనాక్షి ధృవీకరించారు.
తల్లి పాత్రలు ఇకపై చేయనని, పెద్ద హీరోలతో నటించడానికి సిద్ధమని మీనాక్షి స్పష్టం చేశారు.
తన గురించి ఏదైనా చెప్పాలంటే తానే చెబుతానని, రూమర్స్ సృష్టించవద్దని మీనాక్షి వార్నింగ్ ఇచ్చారు.
మీనాక్షి కెరీర్, తాజా ప్రాజెక్టులు
‘ ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి.. అనతి కాలంలోనే స్టార్ ఈమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇక సంక్రాంతికి వస్తున్నాం, లక్కీ భాస్కర్ వంటి సినిమాలతో ఈ క్రేజ్ మరింత పెంచుకున్న మీనాక్షి ప్రజెంట్ వరుస చిత్రాలు అనౌన్స్ చేస్తూ సందడి చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు రెండు, మూడు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అలాగే.. చిరంజీవి విశ్వంభరలో కూడా తాను భాగం అయినట్లు చెప్పుకొచ్చింది మీనాక్షి.
‘ఇలాంటి పాత్రలే చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. నటిగా ఎలాంటి పాత్ర వచ్చినా చేయాలి.. అప్పుడు మాత్రమే మన నటన విలువ తెలుస్తుంది. అయితే.. లక్కీ భాస్కర్ చిత్రంలో తల్లి రోల్ చేశాను. ఆ కథ, పాత్ర నాకు చాలా బాగా నచ్చాయి. అందుకే చేశాను. కానీ ఇకపై పిల్లల తల్లిగా కనిపించే పాత్రలు వస్తే మాత్రం చేయను.. మొహమాటం లేకుండా నో చెబుతా.. కానీ పెద్ద హీరోలతో కలిసి సినిమాలు చేయడానికి మాత్రం నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అలా చేసే అవకాశం వస్తే దాన్ని కొత్త జానర్‌గా తీసుకుంటాను. సంక్రాంతికి వస్తున్నాం మూవీ షూటింగ్‌ను బాగా ఎంజాయ్ చేశాం. ఇక మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న విశ్వంభర సినిమా నా కెరీర్‌లో స్పెషల్ ఛాప్టర్‌గా నిలుస్తుందని నమ్ముతున్నాను ’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక రూమర్స్‌పై స్పందిస్తూ.. నా గురించి ఏదైనా చెప్పాలంటే నేనే స్వయంగా చెబుతా.. నాకూ సోషల్ మీడియా ఉంది.. కాబట్టి ఇతరులు రూమర్స్ సృష్టించాల్సిన అవసరం లేదు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది మీనాక్షి. ప్రజెంట్ ఈ కామెంట్స్ వైరల్ అవుతుండగా.. విశ్వంభర లో తాను భాగం అయినట్లు కన్ఫర్మ్ అయింది.
విశ్వంభర: నా కెరీర్‌లో స్పెషల్ చాప్టర్
పాత్రల ఎంపిక, రూమర్స్ పై మీనాక్షి స్పందన
మీనాక్షి చౌదరి విశ్వంభర సినిమాపై ఎంతో నమ్మకంతో ఉన్నారు. తన పాత్ర తనకు ప్రత్యేక గుర్తింపునిస్తుందని భావిస్తున్నారు. రూమర్స్ పై ఆమె ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. భవిష్యత్తులో ఆమె ఎలాంటి పాత్రలు చేస్తారో చూడాలి.


