
📌 Key Points
- మీనాక్షి చౌదరి: తొలి సినిమా షూటింగ్‌లో దర్శకుడి తిట్ల వల్ల కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్!
- తొలిరోజు షూటింగ్‌తోనే సినిమాలు వదిలేద్దామనుకున్న మీనాక్షి సంచలన నిర్ణయం!
- గుంటూరు కారం, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన మీనాక్షి.
- 2026 సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో మీనాక్షి చౌదరి సందడి చేయనుంది.
టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి సంచలన విషయాలు బయటపెట్టింది. మొదటి సినిమా షూటింగ్‌లో జరిగిన సంఘటన గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
షూటింగ్ మొదటి రోజు కన్నీళ్లు పెట్టుకున్న మీనాక్షి!
Meenaakshi Chaudhary : తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్స్ లో మీనాక్షి చౌదరి ఒకరు. మీనాక్షి బ్యాక్ టు బ్యాక్ సంక్రాంతికి తన సినిమాలతో సందడి చేస్తుంది. 2024 సంక్రాంతికి గుంటూరు కారం సినిమా, 2025 సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో హిట్స్ కొట్టిన మీనాక్షి 2026 సంక్రాంతికి అనగనగా ఒక రాజు సినిమాతో రానుంది.(Meenaakshi Chaudhary)
సినిమాలు వదిలేద్దామనుకున్న మీనాక్షి చౌదరి!
తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు మీడియాతో మాట్లాడింది మీనాక్షి. ఈ మీడియా మీట్ లో సినిమా గురించి, తన గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. ఈ క్రమంలో తను సినిమాల్లో బాగా ఫీల్ అయిన ఓ విషయం చెప్పుకొచ్చింది.
మీనాక్షి చౌదరి సంచలన వ్యాఖ్యలు వైరల్!
మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. నా మొదటి సిరీస్ హిందీలో అవుట్ ఆఫ్ లవ్ చేశాను. ఆ సిరీస్ డైరెక్టర్ తిగ్మన్షు ధూళియ చాలా స్ట్రిక్ట్. ఆయన అప్పటికే సీనియర్ డైరెక్టర్. నాకు అదే ఫస్ట్ సిరీస్. అప్పటికి సినిమాలు కూడా ఏమి చేయలేదు. మొదటి రోజు షూటింగ్ లోనే డైరెక్టర్ తిట్టారు. నా వల్ల కాలేదు. ఏడ్చేసాను. నేను సినిమాలు మానేద్దాం అని అప్పుడే ఫిక్స్ అయ్యాను. నా మేనేజర్ కి ఫోన్ చేసి నేను ఆ సిరీస్ చేయను బయటకు వచ్చేస్తాను అని చెప్పాను. కానీ కాంట్రాక్ట్ రాశాము అని చెప్పడంతో చేశాను. అప్పుడు నుంచి కష్టపడ్డాను కాబట్టే ఇవాళ ఈ స్టేజిలో ఉన్నాను అని తెలిపింది.
మీనాక్షి చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


