|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఉబర్ పై హీరోయిన్ ఫైర్: డ్రైవర్ నిద్ర, దారుణమైన సేవలు! షాకింగ్ కామెంట్స్ వైరల్!

Published: 25-02-2026, 3:35 PM
ఉబర్ పై హీరోయిన్ ఫైర్: డ్రైవర్ నిద్ర, దారుణమైన సేవలు! షాకింగ్ కామెంట్స్ వైరల్!
  • హీరోయిన్ మీరా చోప్రాకు చేదు అనుభవం: ఉబర్ డ్రైవర్ నిర్లక్ష్యం, నిద్రపోతూ కారు నడపడం!
  • ఆరు గంటలకు బుక్ చేస్తే దుమ్ము కొట్టిన కారు, డర్టీ డ్రైవర్: మీరా షాకింగ్ కామెంట్స్!
  • ప్రయాణికుల భద్రత గాలికి, డబ్బులే ముఖ్యం: ఉబర్ పై మీరా ఆగ్రహం, ట్వీట్ వైరల్!
  • 20 నిమిషాల్లోనే దిగిపోయినా 6 గంటల ఫీజు వసూలు: ఉబర్ నిర్వాకంపై మీరా ఫైర్!

టాలీవుడ్ హీరోయిన్ మీరా చోప్రాకు ఊహించని షాక్! ఉబర్ క్యాబ్ బుక్ చేసుకుంటే ఎదురైన అనుభవం ఆమెను తీవ్రంగా కలచివేసింది. డ్రైవర్ నిర్లక్ష్యం, ఉబర్ సర్వీసుపై ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఉబర్ లో భయానక అనుభవం: మీరా చోప్రా ఆవేదన

హీరోయిన్ మీరా చోప్రా.. తాజాగా తనకు ఎదరైనా ఓ చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది. క్షేమంగా, వేగంగా వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంటే డ్రైవర్ ప్రవర్తనతో ప్రానాలు అరచేతలో పెట్టుకున్నానని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేస్తూ.. ‘ఉబర్ కారణంగా నేను భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నాను. రీసెంట్‌గా ఓ ఆరుగంటల కోసం కారు బుక్ చేసుకున్నా. తీరా దుమ్ము, మురికి పట్టిన కారు వచ్చింది. డ్రైవర్ కూడా అంతే డర్టీగా ఉన్నాడు. కారు ఎందుకింత మురికిగా ఉందని డ్రైవర్‌ను అడిగాను. కానీ అతడు ఆన్సర్ చేసే స్థితిలో లేడు. కారు నడుపుతూనే నిద్రపోతున్నాడు. 20 నిమిషాల్లో ఆ క్యాబ్ దిగిపోయి మరొకటి బుక్ చేసుకున్నాను. కానీ ఉబర్ మాత్రం నా నుంచి 6 గంటట ఫీజు వసూలు చేసింది. ప్రయాణికుల భద్రతను మాత్రం గాలికి వదిలేసింది. కేవలం డబ్బులు సంపాదించడం మాత్రమే వారి పని. ఇదెంత అసహ్యకరం’ అంటూ ట్వీట్ చెయ్యగా.. ప్రజెంట్ అది వైరల్‌గా మారింది.

డబ్బులే ముఖ్యం.. ప్రయాణికుల భద్రత గాలికి?

వైరల్ అవుతున్న మీరా ట్వీట్.. ఉబర్ పై నెటిజన్ల ఆగ్రహం!

మీరా చోప్రా చేసిన ఈ ఆరోపణలపై ఉబర్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను తెలియజేయండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.