|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగాస్టార్‌కు నంబర్ మ్యాజిక్! ‘మెగా 158’ విడుదల వెనుక సంచలన రహస్యం!

Published: 23-02-2026, 12:35 AM
మెగాస్టార్‌కు నంబర్ మ్యాజిక్! 'మెగా 158' విడుదల వెనుక సంచలన రహస్యం!
  • మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘మెగా 158’ మార్చి 3న ప్రారంభం కానుంది.
  • ఈ సినిమా 2026 సంక్రాంతికి జనవరి 12న విడుదల కానుంది, ఇది ‘3’ అనే నెంబర్‌కు సూచన.
  • దర్శకుడు బాబీ గతంలో ‘వాల్తేరు వీరయ్య’తో చిరంజీవికి బ్లాక్ బస్టర్ అందించారు.
  • ‘మెగా 158’ ఒక హై-వోల్టేజ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది.

మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న ‘మెగా 158’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు ‘3’ అనే నెంబర్ కలిసి వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. విడుదల తేదీ కూడా నెంబర్ 3కి దగ్గరగా ఉండటం విశేషం.

‘మెగా 158’లో నెంబర్ 3 మ్యాజిక్ ఏమిటి?

Mega 158: మెగాస్టార్ చిరంజీవి అంటేనే రికార్డుల రారాజు. ఆయన సినిమా అనౌన్స్‌మెంట్ నుంచి రిలీజ్ వరకు ప్రతి విషయంలోనూ ఏదో ఒక విశేషం ఉంటుంది. తాజాగా బాబీ దర్శకత్వంలో KVN ప్రొడక్షన్స్ నిర్మించబోతున్న సినిమా (మెగా 158) విషయంలో ఒక ఆసక్తికరమైన సెంటిమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే “నెంబర్ 3” మేజిక్.

Read also- Art Director Ramakrishna: రామ్ చరణ్ నేషనల్ అవార్డు వస్తుందన్నారు.. కానీ!

బాబీ దర్శకత్వంలో చిరంజీవి వింటేజ్ మాస్ యాంగిల్

మెగాస్టార్ చిరంజీవికి ‘3’ అనే అంకె చాలా కలిసివస్తుందని అభిమానుల నమ్మకం. ఇప్పుడు బాబీతో చేయబోయే సినిమా విషయంలో కూడా ఇదే రిపీట్ అవుతోంది. ఈ సినిమా గ్రాండ్ ఓపెనింగ్ మార్చి 3న జరగనుంది. సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12, 2026న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. 12వ తేదీ అంటే (1+2) కూడా 3 అవుతుంది. చిరంజీవి-బాబీ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ కూడా సరిగ్గా జనవరి 13న (సంక్రాంతి సమయం) విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మన శంకర వర ప్రసాద్ కూడా 12 న వచ్చి బ్లక్ బాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో మెగాస్టార్ మూడు నెంబరుపై మనసు పాడేసుకున్నట్లుగా తెలుస్తోంది.

Read also- Illu Illalu Pillalu Today Episode: సాగర్, నర్మద పై అనుమానం.. శ్రీవల్లికి ప్రేమ షాక్.. వనజకు నర్మద స్ట్రాంగ్ వార్నింగ్..

సంక్రాంతి బరిలో ‘మెగా 158’.. రికార్డులు క్రియేట్ చేసేనా?

ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకడానికి ప్రధాన కారణం దర్శకుడు బాబీ. ‘వాల్తేరు వీరయ్య’తో చిరంజీవిలోని వింటేజ్ మాస్ యాంగిల్‌ను చూపించిన బాబీ, ఈసారి “ది బ్లడీ బెంచ్ మార్క్” అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్నారు. రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్‌లో రక్తం చిందిన గొడ్డలిని చూపించి, ఇదొక హై-వోల్టేజ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా అని స్పష్టం చేశారు. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ఈ సోషియో ఫాంటసీ విజువల్ వండర్ 2026 వేసవిలో సందడి చేయనుంది. ఇప్పటికే ‘మన శంకరవరప్రసాద్ గారు’ సంక్రాంతి బ్లాక్ బాస్టర్ కొట్టేశారు. ఒకే అంకె ముహూర్తానికి, రిలీజ్ డేట్‌కు రావడం కేవలం యాదృచ్చికమే కావొచ్చు, కానీ మెగా అభిమానులు మాత్రం దీన్ని ఒక శుభశకునంగా భావిస్తున్నారు. బాస్ బాక్సాఫీస్ దగ్గర మరోసారి సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి నెంబర్ సెంటిమెంట్ ఇండస్టీలో కొత్తేం కాదు.. ఇది వరకే చాలా మంది పెద్దవారు వీటిని ఫాలో అయ్యే వారు. ఇప్పటికే చాలా మంచి ఆచరిస్తున్నారు. మరి మెగాస్టార్ అనుకున్న తేదీనే సినిమా విడుదలై అదే మ్యాజిక్ చేస్తుందో లేదు చూడాలి మరి. అయితే కేవీఎన్ ప్రొడక్షన్ నుంచి రానున్న ‘మెగా 158’ నిర్మాత మారే అవకాశం కనిపిస్తుంది. ఇదే నిర్మాతలు జన నాయగన్ సినిమాను కూడా తీయడంతో ఇంకా ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు దీంతో నిర్మాతలు ఆర్టిక ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి, మెగాస్టార్ అభిమానులు ఈ నెంబర్ సెంటిమెంట్‌ను బాగా నమ్ముతున్నారు. ‘మెగా 158’ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తుందని ఆశిస్తున్నారు. వేచి చూడాల్సిందే!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.