
వకీల్ సాబ్ సినిమాతో పరిచయమైన అనన్య నాగళ్ళ, తాజా ఇంటర్వ్యూలో తన బ్రేకప్ గురించి ఎమోషనల్‌గా మాట్లాడింది. రెండేళ్ల పాటు ఆమె ఎదుర్కొన్న బాధలను, వృత్తిపరమైన బాధ్యతలను ఆమె ఈ ఇంటర్వ్యూలో వివరించింది.
Key Points
అనన్య నాగళ్ళ తన బ్రేకప్ గురించి ఎమోషనల్‌గా మాట్లాడింది.
రెండేళ్ళ పాటు బాధపడిన విషయాన్ని వెల్లడించింది.
రాత్రుళ్ళు ఏడుస్తూనే ఉదయం జిమ్ కి వెళ్లేదని తెలిపింది.
షూటింగ్ సమయంలో చిరునవ్వుతో పనిచేసేదని చెప్పింది.
అనన్య నాగళ్ళ ఎమోషనల్ ఇంటర్వ్యూ
యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల(Ananya Nagalla) మనందరికీ సుపరిచితమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన ‘వకీల్ సాబ్’(Vakeel Saab) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు ఫస్ట్ మూవీనే మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటిస్తూ మెప్పిస్తుంది. అంతేకాకుండా హీరోయిన్‌గా కూడా రాణిస్తోంది. అలా గత ఏడాది ‘తంత్ర’(Tantra), ‘పొట్టేల్’(Pottel), ‘శ్రీకాకుళం షెర్లాక్ హోల్మ్స్’(Srikakulam Sherlock Holmes), ‘డార్లింగ్’(Darling) వంటి సినిమాల్లో నటించి అలరించింది. ప్రస్తుతం ఒకటి రెండు ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడుపుతోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ తన బ్రేకప్ గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. ఆమె మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీకి వచ్చాక కొంతకాలానికే నాకు బ్రేకప్ జరిగింది. అది నా జీవితంలో ఎదురైన పెద్ద షాక్. దాదాపు రెండేళ్ల పాటు ఆ విషయంలో బాధ పడ్డాను. కానీ బయటకి ఎప్పుడూ ఆ విషయాన్ని చూపించలేదు. కానీ రాత్రంతా ఆ విషయాలు గుర్తుకు వచ్చి ఏడ్చేదాన్ని. అలా నైట్ మొత్తం ఏడ్చిన కూడా, ఉదయానికి జిమ్‌కి వెళ్లేదాన్ని. కారవాన్‌లో కన్నీళ్లు పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. అయితే షూటింగ్ టైమ్ వచ్చేసరికి మళ్లీ చిరునవ్వుతో వర్క్ మొదలుపెట్టేదాన్ని. ఎందుకంటే నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన డైరెక్టర్లు, నిర్మాతలను నిరాశపరచకూడదని ధృడ సంకల్పంతో అలా చేసేదాన్ని’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బ్రేకప్ తర్వాత ఆమె అనుభవాలు
వృత్తిపరమైన బాధ్యతలు
అనన్య నాగళ్ళ తన వ్యక్తిగత బాధలను ఎదుర్కొంటూనే, వృత్తిపరంగా రాణించడానికి కృషి చేసిందని ఈ ఇంటర్వ్యూ స్పష్టం చేస్తుంది. ఆమె ధైర్యం మరియు నిబద్ధత అభినందనీయం.


