|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగాస్టార్ బ్లాక్ బస్టర్: అశ్విని దత్ తో చిరు మూవీ ఫిక్స్! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్!

Published: 21-02-2026, 5:05 AM
మెగాస్టార్ బ్లాక్ బస్టర్: అశ్విని దత్ తో చిరు మూవీ ఫిక్స్! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్!
  • మెగాస్టార్, అశ్విని దత్ కాంబోలో మరో భారీ చిత్రం!
  • నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మైథలాజికల్ కథతో సినిమా!
  • ప్రభాస్ ‘కల్కి 2’ తర్వాత చిరుతో నాగ్ సినిమా ప్రారంభం!
  • జగదేక వీరుడు అతిలోక సుందరి కాంబో మళ్ళీ రిపీట్!

మెగా అభిమానులకు పండగే! మెగాస్టార్ చిరంజీవి మరో భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అశ్విని దత్ నిర్మాణంలో, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక మైథలాజికల్ మూవీ రాబోతుంది. ఈ సినిమా టాలీవుడ్ లో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం.

చిరు, అశ్విని దత్ కాంబో రిపీట్!

Mega Combo: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా క్రేజీ సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసిన మెగాస్టార్ త్వరలో విశ్వంభర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. భారీ గ్రాఫికల్ మూవీ గా వస్తున్న విశ్వంభర సినిమాను దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత వాల్తేరు వీరయ్య మూవీ దర్శకుడు బాబీ కొల్లితో ఒక సినిమా, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమాను లైన్ లో పెట్టాడు మెగాస్టార్.

అయితే, రీసెంట్ గా మరో భారీ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట చిరు. అందుకోసం మెగా ప్రొడ్యూసర్ అశ్విని దత్(Mega Combo) తో చాలా కాలం తరువాత జత కట్టనున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో జగదేక వీరుడు అతిలోక సుందరి, చూడాలని ఉంది, ఇంద్ర, జై చిరంజీవ లాంటి సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు చాలా కాలం తరువాత ఈ ఇద్దరు కలిసి ఒక సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మూవీ!

ఇక ఈ సినిమాకు అశ్విని దత్ అల్లుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్నాడని సమాచారం. ప్రస్తుతం నాగ్ అశ్విన్ ప్రభాస్ తో కల్కి 2 సినిమాను చేసే పనిలో ఉన్నాడు. దీనికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఇప్పటికే స్టార్ అయ్యింది. అయితే, ఇటీవల నాగ్ అశ్విన్ నిర్మాత అశ్విని దత్ కి ఒక కథను వినిపించాడట. అది నచ్చడంతో మెగాస్టార్ కి అయితే బాగుంటుంది అని సజెస్ట్ చేశాడట.

మైథలాజికల్ కథతో వస్తున్న సినిమా!

ఆ కథను చిరుకి వినిపించగా ఆయన కూడా ఒకే చేశాడట. కల్కి సినిమాలాగే ఈ కథ కూడా మైథాలజీ సబ్జెక్టుతో రానుందట. త్వరలోనే ఈ భారీ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. నిజానికి నాగ్ అశ్విన్ మహానటి సినిమా తరువాతనే మెగాస్టార్ తో ఈ సినిమా చేయాల్సి ఉంది. కానీ, అనూహ్యంగా ప్రభాస్ ప్రాజెక్ట్ ముందుకు వచ్చింది. ఇప్పుడు మరోసారి మెగాస్టార్ తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు నాగ్ అశ్విన్. ప్రభాస్ కల్కి 2 పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్టు మొదలయ్యే అవకాశం ఉంది.

మెగాస్టార్, అశ్విని దత్, నాగ్ అశ్విన్ ల కలయికలో వస్తున్న ఈ సినిమా టాలీవుడ్ లో సంచలనం సృష్టించడం ఖాయం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.