
మెగాస్టార్ చిరంజీవి మనవరాలు నిహారిక తన తాజా ఫోటోషూట్‌లో అందాలను ఆరబోసింది. వీపుపై ఉన్న టాటూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Key Points
నిహారిక కొత్త ఫోటోషూట్‌లో అందాలను ఆరబోసింది.
వీపుపై ఉన్న టాటూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నెటిజన్లు నిహారిక అందాలకు ఫిదా అయ్యారు.
నిహారిక త్వరలోనే రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
నిహారిక ఫోటోషూట్ వైరల్
మెగా డాటర్ నిహారిక(Niharika ) గతంలో హీరోయిన్‌గా నటించినప్పటికీ పెద్దగా ఫేమ్ సంపాదించుకోలేకపోయింది. ఇక ఇటీవల నిర్మాతగా మారిన నిహారిక మొదటి ప్రాజెక్ట్ ‘కమిటీ కుర్రోళ్లు’(Committee Kurrollu) ఊహించని విధంగా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇదిలా ఉంటే.. త్వరలో నిహారిక తన రెండో మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రొడక్షన్-2 పేరుతో రాబోతున్న ఈ మూవీలో సంగీత్ శోభన్(Sangeet Shobhan), నయన్ సారికా(Nayan Saarika) జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకు మానస శర్మ దర్శకత్వం వహిస్తోంది.
ఇటీవల ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా మొదలైన విషయం తెలిసిందే. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ నిహారిక సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం పలు ఫొటోలు షేర్ చేస్తూ అందరికీ హాట్ ట్రీట్ ఇస్తోంది. తాజాగా, నిహారిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇందులో మల్టీ కలర్ ఫ్రాక్ ధరించిన ఆమె బ్యూటిఫుల్ స్మైల్‌లో ఫొటోకు పోజులిచ్చింది. స్లీవ్ లెస్ డ్రెస్‌లో కనిపించగా.. హ్యాండ్స్ కిందరు జారుతున్నట్లు ఉన్నాయి. ఇక ఇందులో వీపుపై ఉన్న టాటూ చూపిస్తూ మత్తేక్కించే కళ్లతో నెటిజన్లు ఫిదా అయ్యేలా చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను చూసిన నెటిజన్లు సూపర్, గార్జియస్, క్యూట్ అని నిహారికను పొగుడుతున్నారు.
టాటూ ఆకర్షణ
నెటిజన్ల స్పందన
నిహారిక సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తన అభిమానులతో అనుబంధాన్ని పెంచుకుంటోంది. ఆమె త్వరలో వచ్చే సినిమాకు కూడా మంచి ఆదరణ లభిస్తుందని ఆశిద్దాం.


