|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగా డాటర్ నిహారికకు చేదు అనుభవం.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో

Published: 11-11-2025, 2:14 AM
మెగా డాటర్ నిహారికకు చేదు అనుభవం.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో

మెగా డాటర్ నిహారికకు ఓ ఈవెంట్‌లో చేదు అనుభవం ఎదురైంది. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఆమె నడుముపై చేయి వేసినట్లున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనతో నిహారిక అసౌకర్యంగా ఫీల్ అవ్వడంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంపై పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Key Points

1

నిహారిక నిర్మాతగా రాణిస్తూ, సోషల్ మీడియాలోనూ చురుకుగా ఉంటుంది.

2

తాజాగా ఓ సినిమా పూజా కార్యక్రమంలో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది.

4

ఈ ఘటనతో నిహారిక అసౌకర్యంగా ఫీల్ అవ్వడంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

నిహారిక కెరీర్, నిర్మాతగా రీఎంట్రీ

మెగా డాటర్ నిహారిక(Niharika Konidela) పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయింది. ఏవో కారణాలతో విడాకుల తీసుకుని మళ్లీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం నిర్మాతగా రాణిస్తోంది. తన మొదటి సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో పాటు పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది. దీంతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న నిహారిక తన రెండో ప్రాజెక్ట్‌ను సంగీత్ శోభన్, నయన్ సారికతో చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి కాగా.. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక నిహారిక ఓ వైపు నిర్మాతగా రాణిస్తూనే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే పలు ఈవెంట్లకు గెస్ట్‌గా వెళ్తూ తన అందంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ మూవీ పూజా కార్యక్రమాలకు గెస్ట్‌గా వెళ్లిన నిహారికకు చేదు అనుభవం ఎదురైంది. అదే కార్యక్రమంలో పాల్గొన్న రాఘవేంద్రరావు(Raghavendra Rao)తో మెగా డాటర్ మాట్లాడుతుండగా.. ఆయన ఆమె నడుముపై చేతి వేసి దగ్గరకు లాక్కున్నట్టుగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో చాలా అసౌకర్యంగా ఫీల్ అయిన నిహారిక వెంటనే ఆయన కూర్చున్న కూర్చీ వెనక్కి వెళ్లి మాట్లాడింది. వీడియోలో క్లియర్‌గా ఆమె ఇబ్బంది పడినట్లు కనిపించడంతో అంతా షాక్ అవుతూ విమర్శలు చేస్తున్నారు. నెక్ట్స్ మూవీలో పనస పండుతో కొట్టాలనుకుంటున్నాడు కావచ్చు అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. చిన్నప్పటి నుంచి ఆయన చేతిలో పెరిగింది కాబట్టి ఆప్యాయతతో అలా చేసి ఉంటారని మరో వ్యక్తి అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

రాఘవేంద్రరావుతో చేదు అనుభవం, వైరల్ వీడియో

సోషల్ మీడియాలో నెటిజన్ల స్పందన, విమర్శలు

నిహారికకు ఎదురైన ఈ చేదు అనుభవం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆప్యాయతతో చేశారా లేక దురుద్దేశంతోనా అని నెటిజన్లు వాదనలు వినిపిస్తున్నారు. మరి దీనిపై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.