
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలీవుడ్ నటి మౌనీరాయ్ ఐటెం సాంగ్‌లో నటించనుందని సమాచారం.
Key Points
మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' సినిమా ఐటెం సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ మౌనీరాయ్ నటించనున్నట్లు వార్తలు
ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారట
నిశ్విక నాయుడు స్థానంలో మౌనీరాయ్‌ను ఎంచుకున్నారని సోషల్ మీడియాలో చర్చ
నెటిజన్లు ఈ కాంబినేషన్‌ను సూపర్ కాంబో అంటూ కామెంట్లు చేస్తున్నారు
విశ్వంభర సినిమాకు సంబంధించిన తాజా వార్త
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’(Vishvambhara). ఈ చిత్రాన్ని వశిష్ట భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. దీనిని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ ప్రమోద్, నిరంజన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి కలిసి నిర్మి్స్తున్నారు. ఇక ఇందులో మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష, అషికా రంగనాథ్(Ashika Ranganath) ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వాయిదాలు పడుతూ వస్తోంది. ఇంకా కొంత షూటింగ్ మిగిలి ఉన్నందున మూవీ మేకర్స్ రిలీజ్ అప్డేట్ ప్రకటించడం లేదు.
దీంతో మెగాఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ సూపర్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీ ఐటెం సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ మౌనీరాయ్ చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ పాటకు కీరవాణిని కాకుండా భీమ్స్ సిసిరోలియోతో చేయిస్తున్నారు. ఇన్నాళ్లు చిరు సరసన కన్నడ బ్యూటీ నిశ్విక నాయుడు ఫిక్స్ అయినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమెను కూడా కాదని మౌనీరాయ్‌ను దింపుతున్నారట మూవీ మేకర్స్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతుండటంతో అవి చూసిన నెటిజన్లు సూపర్ కాంబో అదరిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.
మౌనీరాయ్ ఐటెం సాంగ్ లో నటన
నెటిజన్ల స్పందన
చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాకు సంబంధించి వస్తున్న వార్తలతో మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మౌనీరాయ్ తన నటనతో సినిమాకు మరింత ఆకర్షణను అందిస్తుందని ఆశిస్తున్నారు.


