|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగా హీరో పెళ్లి గుట్టు రట్టు! ఆ హీరోయిన్‌తోనే ముహూర్తం ఫిక్స్? షాకింగ్ నిజాలు!

Published: 31-03-2026, 2:35 PM
మెగా హీరో పెళ్లి గుట్టు రట్టు! ఆ హీరోయిన్‌తోనే ముహూర్తం ఫిక్స్? షాకింగ్ నిజాలు!
  • మెగా ఫ్యామిలీలో వరుస వేడుకలు జరుగుతున్నాయి.
  • వైష్ణవ్ తేజ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు పుకార్లు.
  • గతంలో ఖండించిన హీరోయిన్‌తోనే వైష్ణవ్ పెళ్లి అంటూ ప్రచారం.
  • మెగా ఫ్యామిలీ ఫంక్షన్లలో తరచుగా కనిపించే హీరోయిన్ ఎవరు అనే చర్చ.

మెగా ఫ్యామిలీలో వరుస వేడుకల నడుమ, మరో మెగా హీరో పెళ్లి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వైష్ణవ్ తేజ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు సమాచారం. గతంలో రూమర్స్‌ను ఖండించిన హీరోయిన్‌తోనే వివాహం జరగనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి?

Mega Hero: ఈ మధ్య మెగా ఫ్యామిలీలో వరుసగా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi), వరుణ్ తేజ్ (Varun Tej) వివాహం, వారికి బాబు పుట్టడం, ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వడం, చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సక్సెస్.. ఇలా వరుసగా ఏదో ఒక ఈవెంట్ మెగా ఫ్యామిలీలో జరుగుతూనే ఉంది. ఇప్పుడు మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి అంటూ సోషల్ మీడియాలో ఒకటే వార్తలు. అల్లు ఫ్యామిలీ హీరోలు మెగా ట్యాగ్‌కు దూరమయ్యారు కాబట్టి.. మెగా హీరోలలో (Mega Heroes) పెళ్లికి ఉంది ఇంకెవరు.. అయితే సాయి దుర్గా తేజ్, లేదంటే వైష్ణవ్ తేజ్ అంతేగా. అవును, వీరిద్దరిలోనే ఒకరు పెళ్లి పీటలు ఎక్కుబోతున్నట్లుగా టాక్ నడుస్తుంది. మరి ఈ వార్తలలో నిజం ఎంతనేది తెలియదు కానీ, ఆ మధ్య వైరల్ అయిన వార్తలే, ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాను ఆక్రమించేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

వైష్ణవ్ తేజ్ పెళ్లిపై వదంతులు

ఆ మధ్య కెరీర్ మొదట్లోనే ఒక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌తో టాలీవుడ్‌ను షేక్ చేసిన యంగ్ హీరో, తొలి సినిమాతోనే రికార్డులు తిరగరాసిన హీరో అంటూ రూమర్స్ బాగా వినిపించాయి. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej) పేరుతో డైరెక్ట్‌గానే వార్తలు దర్శనమిచ్చాయి. ఇప్పుడీ హీరో తన పర్సనల్ లైఫ్‌ని కూడా నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యారట. త్వరలోనే ఈ మెగా హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు టాక్ నడుస్తుంది. అప్పట్లో వినిపించిన హీరోయిన్‌తోనే వైష్ణవ్ పెళ్లి ఉండబోతుందనేలా.. సోషల్ మీడియా అంతా టామ్ టామ్ చేస్తున్నారు. వాస్తవానికి మొదట్లో వార్తలు వచ్చినప్పుడే వైష్ణవ్ అండ్ సదరు హీరోయిన్ స్పందించి, ఆ రూమర్స్‌ని ఖండించారు. ఇప్పుడు మళ్లీ వార్తలు వస్తున్నాయంటే, ఈసారి కచ్చితంగా ఏదో ఒక విషయం ఉండే ఉంటుందనేది నెటిజన్ల వాదన.

ఆ హీరోయిన్ ఎవరు.. నిజమెంత?

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? వైష్ణవ్ చేసుకోబోయే హీరోయిన్ అంటూ వినిపిస్తున్న వార్తలలో హీరోయిన్.. తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. గత కొంతకాలంగా ఈమె మెగా ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి చిన్న ఫంక్షన్‌లోనూ కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అటు ఫ్యామిలీ మెంబర్స్‌తో, ఇటు మెగా హీరోలతో ఆమెకున్న సాన్నిహిత్యం చూస్తుంటే.. పెళ్లి వార్త నిజమేనని ఫ్యాన్స్ కూడా గట్టిగా నమ్ముతున్నారు. ఈ మెగా పెళ్లికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వస్తుందా? అంటూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ హీరోయిన్‌కు అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ఓ పవర్ ఫుల్ ప్రాజెక్ట్ మినహా.. ఇంకా ఎటువంటి అప్డేట్స్ లేవు. సో.. ఈ వార్తలపై మళ్లీ వైష్ణవ్, సదరు హీరోయిన్ మరోసారి స్పందించి ఖండిస్తారో.. లేదంటే ఏకంగా ఎంగేజ్‌మెంట్ అంటారో? అనేది కాలమే డిసైడ్ చేయాలి. చూద్దాం.. ఈ వార్తలకు ఎలాంటి ముగింపు వస్తుందో?

మొదట్లో ఖండించినప్పటికీ, ఇప్పుడు వస్తున్న వార్తల్లో నిజం ఎంత ఉందో చూడాలి. మెగా ఫ్యామిలీ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఈ పెళ్లి వార్తలపై మీ అభిప్రాయాలను తెలియజేయండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.