|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాలయ్య మనసు గెలిచిన శర్వానంద్! ఏం చేశాడో తెలుసా?

Published: 21-01-2026, 8:05 AM
బాలయ్య మనసు గెలిచిన శర్వానంద్! ఏం చేశాడో తెలుసా?
  • శర్వానంద్ సినిమా టైటిల్‌ను వాడుకోవడంపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
  • అన్‌స్టాపబుల్ షోలో బాలయ్యే స్వయంగా సినిమా ముహూర్తం ఫిక్స్ చేశారట.
  • సినిమా సక్సెస్ అయ్యాక బాలకృష్ణ.. శర్వానంద్‌ను అభినందించారు.
  • సంక్రాంతికి విడుదలైన ఐదు సినిమాల్లో శర్వానంద్ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

శర్వానంద్ నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమా టైటిల్ గతంలో బాలకృష్ణ నటించిన సినిమాది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ, శర్వానంద్‌ను ప్రశంసించారు.

శర్వానంద్ సినిమాకు బాలయ్య ఆశీస్సులు

Balakrishna: ఇటీవల కాలంలో ఎన్నో సినిమాలకు పాత సినిమాల టైటిల్స్ పెడుతూ మంచి సక్సెస్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇలా సంక్రాంతి పండుగ సందర్భంగా శర్వానంద్ హీరోగా నటించిన నారీ నారీ నడుమ మురారి(Nari Nari Naduma Murari) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఇదే టైటిల్ తో గతంలో బాలకృష్ణ (Balakrishna)సినిమా చేసి సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ అందుకున్నారు. ఇక తాజాగా బాలయ్య టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్ (Sharwanand)సైతం అదే స్థాయిలో సక్సెస్ అందుకున్నారు. జనవరి 15వ తేదీ విడుదలైన ఈ సినిమా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకొని సంక్రాంతి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు మంచి ఆదరణ వస్తున్న నేపథ్యంలో దర్శక నిర్మాతలతో శర్వానంద్ ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈ సినిమా టైటిల్ గురించి బాలయ్య రియాక్షన్ పట్ల శర్వానంద్ ఆసక్తికరమైన విషయాన్ని అందరితో పంచుకున్నారు. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ కార్యక్రమానికి శర్వానంద్ హాజరైన సంగతి తెలిసిందే అయితే ఈ షో లోనే బాలయ్య ఈ సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేశారని తెలిపారు. ఇలా మీ సినిమా టైటిల్ వాడుకుంటున్నాం సర్ అంటూ అడగడంతో వెంటనే బాలకృష్ణ గారు “ఏయ్.. నువ్వు అడగడం ఏంటి నువ్వు నా వాడు శుభ్రంగా పెట్టుకో” అంటూ ముహూర్తం కూడా ఆయనే పెట్టారని శర్వానంద్ తెలిపారు. ఇలా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏదో పనిమీద నేను బాలకృష్ణ గారికి ఫోన్ చేశానని శర్వానంద్ తెలిపారు.

బాలకృష్ణ ప్రశంసలు అందుకున్న శర్వా

బాలకృష్ణ గారికి ఫోన్ చేయడంతో ఇలా సినిమాకు మంచి టాక్ వచ్చిందని థాంక్యూ సర్ అని చెప్పడంతో “ఏయ్ విన్నాను..నా పరువు నిలబెట్టావు” అంటూ బాలకృష్ణ గారు తనని ప్రశంసించారంటూ ఈ సందర్భంగా శర్వానంద్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలకృష్ణ ఇదే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక శర్వాకు కూడా బాలయ్య టైటిల్ తో హిట్ కొట్టడంతో పరువు నిలబెట్టావ్ అంటూ ప్రశంసించారని తెలిసి బాలయ్య అభిమానులతో పాటు శర్వానంద్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఏకంగా ఐదు సినిమాలు విడుదలయ్యాయి.

సంక్రాంతి బ్లాక్ బస్టర్..

సంక్రాంతి బరిలో నిలిచిన శర్వానంద్ చిత్రం

ప్రభాస్, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సినిమాలు విడుదలైనప్పటికీ శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలవడం విశేషం. ఇక ఈ సినిమా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కగా ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమాలో శర్వానంద్ కు జోడిగా సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత శర్వానంద్ సూపర్ సక్సెస్ అందుకోవడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

బాలకృష్ణ టైటిల్‌తో శర్వానంద్ విజయం సాధించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.