
బాక్సాఫీస్ వార్‌కు సిద్ధమవుతున్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మరియు నటసింహ బాలకృష్ణ ‘అఖండ 2’ సినిమాలు. రెండు సినిమాలు 2025 దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కానున్నాయి.
Key Points
పవన్ కళ్యాణ్ 'ఓజీ' మరియు బాలకృష్ణ 'అఖండ 2' సినిమాలు ఒకే రోజున విడుదల అవుతున్నాయి.
2025 దసరా కానుకగా సెప్టెంబర్ 25న రెండు సినిమాలు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ మధ్య బాక్సాఫీస్ పోటీ ఇప్పటికే మొదలైంది.
పవన్ కళ్యాణ్ (పిఠాపురం ఎమ్మెల్యే) మరియు బాలకృష్ణ (హిందూపురం ఎమ్మెల్యే) మధ్య సోషల్ మీడియాలో 'ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్యే' పోటీ చర్చనీయాంశంగా మారింది.
ఒకే రోజు రిలీజ్‌కు సిద్ధమైన ‘ఓజీ’, ‘అఖండ 2’
బాక్సాఫీస్ దగ్గర మరోసారి మెగా వర్సెస్ నందమూరి పోరుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే చాలా సార్లు మెగా హీరోలు, నందమూరి హీరోలు బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డారు. కానీ ఈ సారి సమరం మరింత ప్రత్యేకం కానుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీ ‘ఓజీ’, నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ 2 తాండవం’ ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయి. ఈ బాక్సాఫీస్ ఫైట్ ఇప్పటి నుంచే హాట్ టాపిక్ గా మారింది.
పవన్ కల్యాణ్ ఓజీ , బాలకృష్ణ అఖండ 2 సినిమాలు 2025 దసరా రోజు రిలీజ్ కాబోతున్నాయి. సెప్టెంబర్ 25న ఈ మూవీస్ థియేటర్లకు రాబోతున్నాయి. ఓజీ రిలీజ్ డేట్ ను మే 25న మేకర్స్ రివీల్ చేశారు. సెప్టెంబర్ 25న థియేటర్లకు ఓజీ వచ్చేస్తున్నాడని ప్రకటించేశారు. తాజాగా అఖండ 2 నుంచి పవర్ ఫుల్ టీజర్ రిలీజ్ చేసిన ఆ మూవీ మేకర్స్ కూడా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు. సెప్టెంబర్ 25నే అఖండ 2ను థియేటర్లకు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రియాక్షన్స్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి , నటసింహం నందమూరి బాలకృష్ణ థియేటర్ వార్ కొన్నాళ్లుగా సాగుతోంది. ఈ ఇద్దరి సినిమాలు చాలా సార్లు ఒకే రోజున, ఒకే పండుగకు రిలీజ్ అయ్యాయి. రీసెంట్ గా వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి 2023 సంక్రాంతికి పోటీపడ్డాయి. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్, బాలకృష్ణ బాక్సాఫీస్ వార్ మాత్రం ఫస్ట్ టైమ్ అని చెప్పొచ్చు.
ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్యే
మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్య ఉత్కంఠ
పొలిటికల్ గా చూసుకున్నా పవన్ కల్యాణ్ , బాలకృష్ణ మధ్య సినిమా వార్ అంటే స్పెషల్ గా నిలుస్తుంది. ఎందుకంటే పవన్ కల్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. దీంతో హిందూపురం ఎమ్మెల్యే వర్సెస్ పిఠాపురం ఎమ్మెల్యే అనే వార్ సోషల్ మీడియాలో సాగుతోంది.
బాక్సాఫీస్ ను షేక్ చేసిన అఖండ మూవీకి సీక్వెల్ గా ఇప్పుడు అఖండ 2 తాండవం మూవీని రెడీ చేస్తున్నారు. బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్ కు ఉండే క్రేజే వేరు. మరోసారి వీళ్లు బాక్సాఫీస్ ను ఊచకోత కోసేందుకు వస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఈ మూవీని రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. మరోవైపు ఫ్యాన్స్ ఎప్పటి నుంచి ఓజీ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సుజిత్ డైరెక్టర్. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పై డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ మరియు బాలకృష్ణ సినిమాల పోటీ బాక్సాఫీస్‌ను ఊపేస్తుందని అంచనా. ఎవరి సినిమా ఎక్కువ వసూళ్లు సాధిస్తుందో చూడాలి.


