
📌 Key Points
- చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతికి విడుదలైంది.
- మూడు రోజుల్లో ఈ సినిమా దాదాపు 160 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది.
- సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా, వెంకటేష్ గెస్ట్ రోల్ లో కనిపించారు.
- సంక్రాంతి సెలవుల కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను ఎక్కువగా చూస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం సంక్రాంతికి విడుదలైంది. ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే దాదాపు 160 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు పెరుగుతున్నాయి.
మూడు రోజుల్లో ‘MSGV’ కలెక్షన్ల వివరాలు
MSGV Collections : మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ చిత్రం మన శంకర వరప్రసాద్ గారు.. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది. మొదటినుంచి భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యాక పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా వెంకటేష్ గెస్ట్ రోల్ చేసి అలరించాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఈ సినిమా బాగా అలరించింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సంక్రాంతి సందర్భంగా ఫ్యామిలీస్ ఎక్కువగా ఈ సినిమాని చూస్తున్నారు అని తెలుస్తుంది.. పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా కలెక్షన్స్ కూడా రోజురోజుకీ పెరుగుతున్నాయి. మొత్తం మూడు రోజులకు ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ ని వసూలు చేస్తుందో ఒకసారి తెలుసుకుందాం..
అనిల్ రావిపూడి సినిమా అంటే మినిమమ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయన్న విషయం తెలిసిందే.. గత ఏడాది వచ్చిన విక్టరీ వెంకటేష్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఈ ఏడాది చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు దర్శకత్వం వహించారు.. ఈ మూవీ భారీ అంచనాలతో జనవరి 12న థియేటర్లోకి వచ్చింది. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ రావడంతో సినిమాకు కలెక్షన్లు కూడా భారీగా వసూల్ అయ్యాయి.. సంక్రాంతి హాలిడేస్ కావడంతో ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా చూస్తున్నారు. కలెక్షన్స్ విషయానికొస్తే.. 84 కోట్లు వసూళ్లను అందుకుంది. చిరు కెరీర్ లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. మూడు రోజుల కలెక్షన్స్ ని మూవీ యూనిట్ ప్రకటించారు. మన శంకర వరప్రసాద్ గారు సినిమా మూడు రోజుల్లో దాదాపు 160 కోట్లను రాబట్టింది. ఈ వీకెండ్ సినిమాకు కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంది.
ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న చిత్రం
చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్
మెగా అభిమానులు ఎప్పుడు అని ఎదురు చూసినా మన శంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లోకి వచ్చేసింది.. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా కలెక్షన్లు కూడా రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా చిరంజీవి ఈ సినిమాకు మొదటి రోజే 84 కోట్లు వసూలు అవడం మామూలు విషయం కాదు. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ కన్నా ఫ్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం భారీగా జరిగింది. దాదాపు 200 నుంచి 300 కోట్లకు పైగా వసూలు చేస్తే సినిమా లాభాల్లోకి వస్తుంది. కానీ ఈ సినిమాకు మొదటి రోజే 84 కోట్లు వచ్చింది. ఇక మూడు రోజులు గాను వరల్డ్ వైడ్ గా 152 కోట్లు వసూల్ చేసింది.. ఇదే విధంగా కలెక్షన్లు కనుక వసూలైతే మాత్రం కచ్చితంగా నెలలోపల 1000 కోట్లను రాబట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు. మరి చివరికి ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి..
చిరంజీవి నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది.


