
📌 Key Points
- మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతికి విడుదల కానుంది.
- ‘దండోరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సినిమా ట్విస్ట్ లీక్ చేసిన నటుడు శివాజీ.
- వెంకటేష్ పాత్ర నిడివి 20 నిమిషాలు ఉంటుందని, చిరంజీవితో కలిసి పాటలో చిందులు వేస్తారని వెల్లడి.
- వెంకటేష్ ఎంట్రీతో సినిమాపై హైప్ అమాంతం పెరుగుతుందని శివాజీ తెలియజేశారు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ట్విస్ట్‌ను నటుడు శివాజీ లీక్ చేసి సంచలనం సృష్టించారు. వెంకటేష్ ప్రత్యేక పాత్ర గురించి వివరాలు వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ సినిమాపై అంచనాలు
టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తుండగా నయనతార హీరోయిన్ గా మెరువనున్నారు. విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ లో కనిపిస్తున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు విక్టరీ వెంకటేష్ పాత్ర నిడివి ఉంటుందట. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి ఓ పాటలో చిందులు కూడా వేయనున్నారట.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్విస్ట్ రివీల్ చేశారు నటుడు శివాజీ. నటుడు శివాజీ ప్రత్యేక పాత్రలో నటించిన మూవీ దండోరా. ఈ మూవీ ఎల్లుండి రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు అనిల్ రావిపూడి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి గురించి చెప్పే ప్రయత్నంలో భాగంగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో ఉన్న ట్విస్ట్ లీక్ రివీల్ చేశారు శివాజీ. ఈ సినిమాలో వెంకటేష్ ఎంట్రీ కాగానే హైప్ అమాంతం పెరుగుతుందట. చిరంజీవి, వెంకటేష్ కనిపించే సీన్లు బాగా పండుతాయి అని శివాజీ వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
శివాజీ సంచలన లీక్!
వెంకటేష్ పాత్ర ఆసక్తికర విషయాలు
శివాజీ లీక్ చేసిన ఈ ట్విస్ట్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది. చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికి రానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.


