|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగాస్టార్‌, నయనతార, అనిల్‌ రావిపూడి ర్యాంపేజ్‌ షురూ.. సంక్రాంతికి థియేటర్లలో వింటేజ్‌ చిరంజీవి రచ్చ

Published: 23-05-2025, 9:59 AM
మెగాస్టార్‌, నయనతార, అనిల్‌ రావిపూడి ర్యాంపేజ్‌ షురూ.. సంక్రాంతికి థియేటర్లలో వింటేజ్‌ చిరంజీవి రచ్చ

మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం ప్రారంభమైంది. ఈ సినిమాలో చిరంజీవి వింటేజ్ స్టైల్ లో కనిపించనున్నారని సమాచారం. హైదరాబాద్ లో షూటింగ్ ప్రారంభమైంది.

Key Points

1

మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా

2

హైదరాబాద్ లో మొదలైన రెగ్యులర్ షూటింగ్

4

సంక్రాంతికి విడుదలకు అవకాశాలున్న చిత్రం

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా

`గ్యాంగ్‌ లీడర్‌`, `ఘరానా మొగుడు` సమయంలో మెగాస్టార్‌ చిరంజీవి కెరీర్ పీక్‌లో ఉంది. అప్పుడు బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్లతో టాలీవుడ్‌ని షేక్‌ చేశారు చిరు. ఆయన సినిమా వచ్చిందంటే థియేటర్లు కళకళలాడాల్సిందే. మాస్‌ ఆడియెన్స్ కి పూనకాలు పక్కా.

థియేటర్లలో చిరంజీవి పాటలని రిపీటెడ్‌గా వేసుకుని డాన్సులు చేసేవారు ఆడియెన్స్. ఆ తర్వాత అలాంటి పరిస్థితులు తగ్గాయి. చిరంజీవి కూడా తన పంథా మార్చారు. సందేశాత్మక చిత్రాలు, ప్రయోగాత్మక చిత్రాలతో కొత్త దారిలో వెళ్లారు. మధ్య మధ్యలో అలాంటి కమర్షియల్‌ మూవీస్‌ చేసినా ఆ స్థాయిలో మెప్పించలేకపోయాయి.

మళ్లీ చాలా ఏళ్ల తర్వాత `వాల్తేర్‌ వీరయ్య`లో మరోసారి వింటేజ్‌ చిరంజీవిని టచ్‌ చేశారు దర్శకుడు బాబీ. ఇప్పుడు పూర్తి స్థాయి వింటేజ్‌ చిరంజీవిని చూపించబోతున్నారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. ఆయన ప్రస్తుతం మెగాస్టార్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో నయనతార హీరోయిన్‌గా ఎంపికైంది. `సైరా` తర్వాత మరోసారి వీరిద్దరు జోడీగా చేస్తున్నారు.

ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నేడు శుక్రవారం(మే 23) నుంచి సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోనే షూటింగ్‌ ప్రారంభించినట్టు టీమ్‌ వెల్లడించింది.

నయనతారతో జంటగా

అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్, చరిష్మాతో ఆడియెన్స్ ని అలరించేందుకు చిరంజీవి రెడీ అయ్యారని, అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఆయన హీరోగా `మెగా157`సినిమా రూపొందుతుందని, వీరి కాంబినేషన్‌లో వస్తున్న తొలి చిత్రం ఇదే అని టీమ్‌ తెలిపింది.

`చిరంజీవి అభిమానులు ఎప్పట్నుంచే ఆయన్ని మళ్లీ పూర్తి స్థాయి హ్యూమరస్‌ క్యారెక్టర్లో చూడాలనుకుంటున్నారు. అలాంటి పాత్రతో అనిల్‌ రావిపూడి ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఈ మూవీని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సాహూ గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నార`ని తెలిపింది టీమ్‌.

ఈ రోజు హైదరాబాద్‌లో సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభం కాగా, మొదటి రోజు డైరెక్టర్ అనిల్ రావిపూడి.. చిరంజీవి పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు.

అనిల్ రావిపూడి దర్శకత్వం

ఈ ప్రాజెక్ట్ విషయంలో చిరంజీవి ఎంతో క్యూరియాసిటీగా, ఇంట్రెస్టింగ్‌గా ఉండటం విశేషం. ఇందులో నయనతార స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలవబోతుంది. ఇటీవల ఆమెపై తీసిన వీడియోకి విశేష స్పందన లభించింది. ఆమె హీరోయిన్‌గా నటించడం కూడా సినిమా మైలేజ్‌ని పెంచింది.

ఇక ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. సమీర్‌ రెడ్డి కెమెరామెన్‌ గా పనిచేస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్. రైటర్స్ ఎస్ కృష్ణ, జి ఆది నారాయణ స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నారు, ఎస్ కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని టీమ్‌ భావిస్తుంది.

ఆ టార్గెట్‌తోనే నేడు షూటింగ్‌ ప్రారంభించింది టీమ్‌. అనిల్‌ రావిపూడి ఈ సంక్రాంతికి వెంకటేష్‌తో `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ చేసి సంచలనాలు క్రియేట్‌ చేసిన విసయం తెలిసిందే. మరి చిరంజీవితో చేస్తున్న ఈ సినిమాతో ఇంకా ఎలాంటి రికార్డులు బ్రేక్‌ చేస్తారో చూడాలి.

చిరంజీవి అభిమానులకు మరో సందడి పండుగ సిద్ధమవుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.