|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

OTT: మ్యూజికల్ రొమాంటిక్ మూవీ.. ఓటీటీలోకి ఎప్పుడంటే?

Updated: 01-10-2025, 11:01 PM

థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోనే ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’ సినిమా ఓటీటీలోకి రానుంది. నరేశ్ అగస్త్య హీరోగా నటించిన ఈ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా సినిమా సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

Key Points

1

నరేశ్ అగస్త్య హీరోగా నటించిన 'మేఘాలు చెప్పిన ప్రేమకథ' ఓటీటీలోకి!

2

ఆగష్టు 22న విడుదలైన సినిమా, సన్ నెక్స్ట్ లో సెప్టెంబర్ 26న స్ట్రీమింగ్.

3

మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం.

4

జూనియర్, సుందరకాండ లాంటి మరికొన్ని సినిమాలు కూడా ఈ వారం ఓటీటీలో విడుదల కానున్నాయి.

‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’ ఓటీటీ విడుదల తేదీ

మరో తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. థియేటర్లలోకి వచ్చిన నెలరోజుల్లోనే స్ట్రీమింగ్ కానుంది. మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రానికి డీసెంట్ టాక్ వచ్చింది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుంది?

మత్తు వదలరా, పంచతంత్రం, పరువు, వికటకవి లాంటి సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న నరేశ్ అగస్త్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’. ఆగస్టు 22న థియేటర్లలో రిలీజ్ కాగా ప్రేక్షకుల్లో పెద్దగా రిజిస్టర్ కాకుండానే మాయమైపోయింది. ఇప్పుడు సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ నెల 26 నుంచి అంటే శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.

సినిమా కథాంశం

‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’ విషయానికొస్తే.. వరుణ్ (నరేశ్ అగస్త్య) విదేశాల్లో చదువుకుని తిరిగి ఇండియాకు వచ్చేస్తాడు. సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనేద ఇతడి కోరిక. దీని గురించి తండ్రికి(సుమన్) చెబితే కోప్పడతాడు. దీంతో వరుణ్ ఇంటి నుంచి బయటకొచ్చేస్తాడు. తమిళనాడులోని వాల్పరై అనే ఊరికి వెళ్తాడు. ఇక్కడ చిన్నప్పుడు నాయినమ్మ కాంచీపురం కామాక్షి శంకరమూర్తి(రాధిక శరత్ కుమార్)తో గడిపిన బంగ్లా, ఎ‍స్టేట్ ఉంటాయి. మరోవైపు మేఘన(రబియా ఖాతూన్) కూడా ఈ ఊరికి వస్తుంది. అనుకోని పరిస్థితుల్లో వరుణ్-మేఘన ప్రేమలో పడతారు. మరి వీరిద్దరి మధ్య దూరం ఎందుకు పెరిగింది? గాయకుడు, సంగీత దర్శకుడిగా వరుణ్ సక్సెస్ అయ్యాడా లేదా అనేది మిగతా స్టోరీ.

మరిన్ని ఓటీటీ విడుదలలు

ఈ వారం ఓటీటీల్లో ‘మేఘాలు చెప్పన ప్రేమకథ’ కాకుండా జూనియర్, సుందరకాండ లాంటి స్ట్రెయిట్ తెలుగు మూవీస్ కూడా స్ట్రీమింగ్ కానున్నాయి. అలానే హృదయపూర్వం, ఒడుమ్ కుతిరా చడుమ్ కుతిరా, సుమతి వళవు తదితర డబ్బింగ్ సినిమాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు సడన్ సర్‌ప్రైజులు లాంటి కొత్త చిత్రాలు కూడా ఏమైనా రావొచ్చు.

చివరగా, ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’ సినిమా ఓటీటీ విడుదలతో, ప్రేక్షకులు ఇంటి వద్దే ఈ సినిమాను ఆస్వాదించవచ్చు. ఇతర చిత్రాలతో పాటు, ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.