
📌 Key Points
- బాలు, మీనా బెస్ట్ కపుల్‌గా గెలిచి ప్రభావతికి షాకిచ్చారు.
- మనోజ్, రోహిణిల రహస్యం బయటపెట్టి జడ్జీలు క్లాస్ పీకారు.
- బాలు తెలివిగా రోహిణిని ఇరికించి మనోజ్‌కు అనుమానం రేపాడు.
- మనోజ్ దగ్గర ఏం దాస్తున్నావని రోహిణిని ప్రభావతి నిలదీసింది.
గుండె నిండా గుడి గంటలు నేటి ఎపిసోడ్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బాలు, మీనా విజయం సాధించగా, మనోజ్-రోహిణిలు అవమానం పాలయ్యారు. మనోజ్ నుండి రోహిణి దాచిన రహస్యంపై ప్రభావతి నిలదీయడంతో సస్పెన్స్ మరింత పెరిగింది.
మనోజ్, రోహిణిలకు క్లాస్ పీకిన జడ్జీలు
గుండె నిండా గుడి గంటలు సోమవారం (డిసెంబర్ 29) ఎపిసోడ్ లో బాలు, మీనా గెలవడాన్ని ప్రభావతి జీర్ణించుకోలేకపోతుంది. దీంతో మనోజ్, రోహిణిలను బాలు ఇరికిస్తాడు. అది రోహిణిని ప్రమాదంలోకి నెట్టేస్తుంది.
గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 585వ ఎపిసోడ్ లో బెస్ట్ కపుల్ గా బాలు, మీనా నిలుస్తారు. అది చూసి ప్రభావతితోపాటు మనోజ్, రోహిణి కుళ్లుకుంటారు. వాళ్లపై పడి ఏడుస్తారు. దీంతో బాలు తనదైన స్టైల్లో రోహిణిని అడ్డంగా ఇరికిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
మనోజ్, రోహిణిలకు క్లాస్ పీకిన జడ్జీలు
బెస్ట్ కపుల్ బాలు, మీనా.. ఉసూరుమన్న ప్రభావతి
ఆ తర్వాత విజేతను ప్రకటించే ముందు మనోజ్ , రోహిణిల పేర్లు ముందుగా పిలుస్తారు. దీంతో తానే గెలిచానని మనోజ్ మురిసిపోతాడు. కానీ జడ్జీలు మాత్రం అతనికి క్లాస్ పీకుతారు. బ్రేక్ టైమ్ లో రోహిణితో మాట్లాడిన వీడియోను చూపించి పరువు తీస్తారు. దీంతో డబ్బు, పరువు రెండూ పోయాయని వాళ్లు బాధపడతారు. ఇక రవి, శృతి గురించి చెబుతూ ఇప్పటికీ మీరు లవర్స్ లాగే ఉన్నారని, అయితే భవిష్యత్తులో మంచి దంపతులు అవుతారని మెచ్చుకుంటారు.
బెస్ట్ కపుల్ బాలు, మీనా.. మెచ్చుకున్న జడ్జీలు
ఉసూరుమన్న ప్రభావతి.. ఊరేగింపుగా బాలు, మీనా
రోహిణి రహస్యంపై ప్రభావతి నిలదీత
అప్పుడే బాలు, మీనా మేళతాళాలతో ఊరేగింపుగా వస్తుంటారు. అది చూసి బాలు, మీనాలే గెలిచారని పార్వతి చెబుతుంది. దీంతో ప్రభావతి ముఖం మాడిపోతుంది. రవి, శృతి కూడా వెళ్లి వాళ్లతో డ్యాన్స్ చేస్తారు. తర్వాత పార్వతి తెచ్చిన దండలను బాలు, మీనా మార్చుకుంటారు. ఇష్టం లేకపోయినా శృతి, పార్వతితో కలిసి ప్రభావతి వాళ్లకు హారతి ఇస్తుంది.
మనోజ్‌కు క్లాస్ పీకిన ప్రభావతి.. ఆట పట్టించిన బాలు
వారానికోసారి వీళ్లు గొడవ పడతారని వాళ్లకు తెలియక వీళ్లను విజేతలుగా చేశారని మనోజ్ అంటాడు. అలా గొడవపడకపోతే ఇద్దరి మధ్యా ఏదో దాపరికం ఉంటుందట అని బాలు చెబుతాడు. దీంతో మనోజ్, రోహిణి ఒకరి ముఖాలు మరొకరు అనుమానంగా చూసుకుంటారు. ప్రభావతి కూడా రోహిణిని నిలదీస్తుంది. మనోజ్ దగ్గర ఏం దాస్తున్నావని అంటుంది. రోహిణి షాక్ తింటుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
బాలు, మీనా విజయం, మనోజ్-రోహిణిల అవమానం, రోహిణి రహస్యం చుట్టూ అల్లుకున్న సస్పెన్స్ గుండె నిండా గుడి గంటలు ఎపిసోడ్‌ను ఆసక్తికరంగా మలిచింది. తదుపరి ఏం జరుగుతుందో చూడాలి.


