
📌 Key Points
- జియో రూ. 449 ప్లాన్ రోజుకు 3GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 SMS అందిస్తుంది.
- ఎయిర్‌టెల్ రూ. 449 ప్లాన్ రోజుకు 4GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 SMS అందిస్తుంది.
- జియో ప్లాన్‌లో హాట్‌స్టార్, జియో క్లౌడ్, గూగుల్ జెమిని ప్రో బెనిఫిట్స్ ఉన్నాయి.
- ఎయిర్‌టెల్ ప్లాన్‌లో గూగుల్ వన్ క్లౌడ్, ఎక్స్‌స్ట్రీమ్ ప్లే, అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం ఉన్నాయి.
ఎయిర్‌టెల్, జియో మధ్య రూ. 449 ప్లాన్ పోలిక ఇప్పుడు హాట్ టాపిక్. ఒకే ధరతో రెండు కంపెనీలు వేర్వేరు డేటా, అదనపు ప్రయోజనాలను అందిస్తున్నాయి. ఈ ప్లాన్‌లలో ఏది మీకు సరిపోతుందో తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
జియో రూ. 449 ప్లాన్ వివరాలు
Airtel vs Jio : ఎయిర్ టెల్ యూజర్లకు అదిరిపోయే ప్లాన్.. రిలయన్స్ జియో కన్నా ఎక్కువ డేటా ఎంజాయ్ చేయొచ్చు. ఈ సింపుల్ ఎయిర్ టెల్ ప్లాన్ ధర రూ. 449 మాత్రమే. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్లు రోజుకు 1GB ఎక్కువ డేటా పొందవచ్చు. బెనిఫిట్స్ చూస్తే జియో రూ. 449 ప్లాన్ ఎయిర్‌టెల్ రూ. 449 ప్లాన్ కన్నా బెటరా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
జియో 449 ప్లాన్ : రిలయన్స్ జియో రూ. 449 రీఛార్జ్ ప్లాన్ ప్రీపెయిడ్ యూజర్లకు పండగే.. రోజుకు 3GB హై-స్పీడ్ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ (Airtel vs Jio) మెసేజ్ బెనిఫిట్స్ అందిస్తుంది. అదనపు బెనిఫిట్స్ విషయానికొస్తే.. రూ. 449 ప్లాన్ డేటా, కాలింగ్ ఎస్ఎంఎస్ బెనిఫిట్స్, 3 నెలల పాటు జియో హాట్‌స్టార్ మొబైల్‌కు యాక్సెస్ కూడా అందిస్తుంది.
ఎయిర్‌టెల్ రూ. 449 ప్లాన్ ప్రయోజనాలు
అంతేకాదు.. ఈ ప్లాన్ 50GB జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ రూ. 35,100 విలువైన గూగుల్ జెమిని ప్రోతో 5000GB క్లౌడ్ స్టోరేజ్ అందిస్తుంది. జెమిని నానో బనానా యాక్సెస్ కూడా అందిస్తుంది. జియో అన్ లిమిటెడ్ 5G ప్లాన్ ద్వారా ఎఫ్ యూపీ లిమిట్ లేకుండా ఎంజాయ్ చేయొచ్చు.
Read Also : WhatsApp iPhones : వావ్.. వాట్సాప్‌లో అద్భుతమైన ఫీచర్.. ఒక్కసారి చూడగానే మెసేజ్‌లు మాయం.. ఎలాగంటే?
ఏ ప్లాన్ మీకు బెస్ట్?
ఎయిర్‌టెల్ 449 ప్లాన్ : ఎయిర్‌టెల్ రూ. 449 ప్లాన్ డేటా పరంగా ఎక్కువ బెనిఫిట్ పొందొచ్చు. రోజుకు 4GB డేటాను పొందవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్ మెసేజ్, అన్‌లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ 5G ప్లాన్‌లో గూగుల్ వన్ కింద 30GB క్లౌడ్ స్టోరేజ్, 28 రోజుల పాటు జియో హాట్‌స్టార్ మొబైల్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే సబ్‌స్క్రిప్షన్, ఆపిల్ మ్యూజిక్, రూ. 4వేలు విలువైన అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం, ప్రతి 30 రోజులకు ఒకసారి ఫ్రీ హలోట్యూన్, ఇంకా స్పామ్ కాల్ ఎస్ఎంఎస్ బ్లాకింగ్ వంటి స్పెషల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.
ఎయిర్‌టెల్ ప్లాన్ రోజుకు 4GB డేటా అందిస్తుంది. రోజుకు 1GB అదనపు డేటా పొందవచ్చు. ఈ రెండు ప్లాన్లలో అదనపు బెనిఫిట్స్ వేరుగా ఉంటాయి. మీకు ఏ ప్లాన్ బెస్ట్ అంటే మీరే డిసైడ్ చేసుకోండి.
చివరగా, ఎయిర్‌టెల్ రోజువారీ డేటాలో పైచేయి సాధిస్తే, జియో అదనపు డిజిటల్ బెనిఫిట్స్‌తో ఆకట్టుకుంటుంది. మీ అవసరాలకు తగ్గట్టుగా సరైన ప్లాన్‌ను ఎంచుకోవడం మీ చేతుల్లోనే ఉంది.


