|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

శ్రీవిష్ణు ‘కామ్రెడ్ కళ్యాణ్’ మ్యూజికల్ జర్నీ షురూ.. ఫస్ట్ సింగిల్ అప్డేట్

Published: 17-06-2026, 3:16 PM
శ్రీవిష్ణు ‘కామ్రెడ్ కళ్యాణ్’ మ్యూజికల్ జర్నీ షురూ.. ఫస్ట్ సింగిల్ అప్డేట్

వైవిధ్యమైన పాత్రలతో వరుస విజయాలతో దూసుకుపోతున్న శ్రీవిష్ణు నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘కామ్రెడ్ కళ్యాణ్’. జానకిరామ్ మారెళ్ళ దర్శకత్వంలో రాబోతుండగా.. ఇందులో శ్రీవిష్ణు సరసన మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయె కీలక పాత్రలో కనిపించనున్నారు. 1992 సంవత్సరంలో ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని విశాఖ జిల్లా మాడుగుల ప్రాంతం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో శ్రీవిష్ణు డబుల్ రోల్ చేయనున్నట్లు టాక్. వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు కొణ వెంకట్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇందులో పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుండగా.. ఆయనకు వీరభిమానిగా శ్రీవిష్ణు కనిపించనున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి మొదటి పాటను విడుదల చేసేందుకు మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. జూన్ 20న కామ్రెడ్ కళ్యాణ్ ఫస్ట్ సింగిల్ ‘ఒరియాపిల్ల’’ సాంగ్ రాబోతున్నట్లు తెలుపుతూ.. ఓ క్రేజీ పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ పోస్టర్‌లో గుడిలో ప్రదక్షిణలు చేస్తున్న హీరోయిన్ మహిమా నంబియార్ చుట్టూ, హీరో శ్రీవిష్ణు దండం పెడుతూ ప్రేమగా చూస్తున్న విజువల్ ఎంతో ఆకట్టుకుంటోంది. ఈ పోస్ట్‌కు ‘‘హద్దులు, అడ్డంకులు లేవు.. కేవలం ప్రేమ మాత్రమే’’ అనే బ్యూటిఫుల్ క్యాప్షన్‌ను కూడా జత చేశారు.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.