
📌 Key Points
- సినిమా టికెట్ రేట్ల పెంపుతో నాకు సంబంధం లేదని స్పష్టం చేసిన మంత్రి కొమటిరెడ్డి.
- పుష్ప-2′ సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటన తనను కలిచివేసిందని వెల్లడి.
- టికెట్ రేట్ల పెంపు కోసం ఇకపై తన వద్దకు రావద్దని సినీ పెద్దలకు మంత్రి తేల్చి చెప్పేశారు.
- ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ వ్యవహారాలకు తాను దూరంగా ఉంటున్నానని తేల్చి చెప్పిన మంత్రి కోమటిరెడ్డి.
తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల వ్యవహారం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో సినిమాటోగ్రఫీ మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ రేట్ల పెంపుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!
టికెట్ రేట్ల పెంపుతో దూరంగా ఉంటా: మంత్రి
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్ల పెంపు (Ticket rate hike)పై హట్ టాపిక్ గా చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు టికెట్ల రేట్ల పెరుగుదల ఉండదని చెప్పిన ప్రభుత్వం తాజాగా ప్రభాస్, చిరంజీవి ల సినిమాల టికెట్ల రేట్లను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ వ్యవహారంపై సినిమాటోగ్రఫి మంత్రి కొమటి రెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komati Reddy Venkat Reddy) స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ వ్యవహారాలకు, టికెట్ రేట్ల పెంపునకు తాను పూర్తిగా దూరంగా ఉంటున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
పుష్ప-2 ఘటన నన్ను కలిచివేసింది: కొమటిరెడ్డి
ముఖ్యంగా ‘పుష్ప-2’ సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ఆ సినిమాకు ప్రత్యేక అనుమతులు ఇచ్చి తప్పు చేశానా అని అప్పట్లో చాలా మదనపడ్డానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బాధతోనే బాబు వైద్య ఖర్చులు కూడా తానే భరించానని, ఆ సంఘటన తన మనసుపై చెరగని ముద్ర వేసిందని గుర్తు చేసుకున్నారు.
సినీ పెద్దలకు మంత్రి తేల్చి చెప్పిన విషయం ఇదే!
ఆ విషాద ఘటన తర్వాతే తాను కఠిన నిర్ణయం తీసుకున్నానని, ఇకపై టికెట్ రేట్ల పెంపు కోసం ఎవరూ తన వద్దకు రావద్దని సినీ పెద్దలకు తేల్చి చెప్పినట్లు మంత్రి స్పష్టం చేశారు. ఆ హెచ్చరిక వల్లే ప్రస్తుతం పరిశ్రమ నుంచి ఎవరూ తనను కలవడం లేదని, ఇప్పుడు సినిమాలకు పెరిగిన టికెట్ ధరలతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి వెల్లడించారు. మొత్తానికి సినిమా ఇండస్ట్రీని పట్టించుకోవడం తాను ఎప్పుడో మానేశానని, ప్రస్తుత రేట్ల వ్యవహారం తన పరిధిలో లేదని కోమటిరెడ్డి కుండబద్దలు కొట్టారు.
మొత్తానికి మంత్రి కొమటిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. దీనిపై సినీ పరిశ్రమ ఎలా స్పందిస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

