
తెలుగు సినిమా ప్రేక్షకులకు మరో సూపర్ హీరో సినిమా ‘మిరాయ్’ విడుదలైంది. తేజ సజ్జా హీరోగా, మంచు మనోజ్ విలన్ గా నటించిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.
Key Points
తేజ సజ్జా, మంచు మనోజ్‌ల నటన అద్భుతం.
కథలోని అశోకుడు, తొమ్మిది గ్రంథాల కాన్సెప్ట్ ఆకట్టుకుంటుంది.
మంచు మనోజ్ విలనిజం ప్రధాన ఆకర్షణ.
కథాంశం మరియు కాన్సెప్ట్
నటీనటులు: తేజ సజ్జా, మంచు మనోజ్, రితికా నాయక్, శ్రీయ సరన్, జగపతి బాబు, జయరాం, రాజేంద్రనాథ్, పవన్ చోప్రా, తంజా కెల్లర్, వెంకట్ మహా, కిశోర్ తిరుమల తదితరులు
దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
విడుదల తేది: సెప్టెంబర్ 12, 2025
నటీనటుల ప్రదర్శన
హనుమాన్ తర్వాత తేజ సజ్జా నటించిన సూపర్ హీరో యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా మిరాయ్. మంచు మనోజ్ విలన్‌గా చేసిన మిరాయ్ సినిమాకు ఈగల్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. హీరోయిన్‌గా రితికా నాయక్ చేయగా.. బ్యూటిఫుల్ శ్రీయ సరన్ కీలక పాత్ర పోషించింది.
మొదటి నుంచి ఎన్నో అంచనాలు క్రియేట్ చేసిన మిరాయ్ సినిమా ఇవాళ (సెప్టెంబర్ 12) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి మిరాయ్ రివ్యూ లో తెలుసుకుందాం.
కళింగ యుద్ధం తర్వాత తనలోని శక్తులను 9 గ్రంథాలుగా మార్చిన అశోకుడు వాటిని కాపాడేందుకు మహిమాన్విత శక్తులు ఉన్న తొమ్మిది మంది రక్షకులకు ఇస్తారు. వారిని దాటుకుని 8 గ్రంథాలను హస్తగతం చేసుకుంటాడు మహావీర్ లామా (మంచు మనోజ్). అయితే, అమరత్వానికి సంబంధించిన తొమ్మిదో గ్రంథం కూడా చేజిక్కుంచుకోవాలని లామా ప్రయత్నిస్తాడు.
అది ముందుగానే మనో నేత్రంతో పసిగట్టిన అంబికా దేవి (శ్రీయ సరన్) బిడ్డకు జన్మనిచ్చి దూరం అవుతుంది. అంబికా దేవి పుత్రుడు వేద వివిధ నగరాల్లో పెరుగుతాడు. ఈ క్రమంలోనే వేదను విభ (రితికా నాయక్) కలుస్తుంది.
ఆ తర్వాత ఏమైంది వేదను విభ ఎందుకు కలిసింది? వేదకు అంబికా గురించి ఎప్పుడు తెలిసింది? వేద నుంచి యోధగా ఎలా మారాడు? మహావీర్ లామాను యోధ ఎలా ఎదుర్కొన్నాడు? ఈ క్రమంలో మిరాయ్ అంటే ఏంటీ? అనే విషయాలు తెలియాలంటే మిరాయ్ చూడాల్సిందే.
సూపర్ హీరో, పవర్స్ వంటి కాన్సెప్ట్‌తో వచ్చే సినిమాల్లో కథ, ఎమోషనల్ ఎంత బలంగా ఉంటే ఆ సినిమా అంతలా పండుద్ది. అలాగే, ఎవరు ఢీ కొట్టలేని పవర్‌ఫుల్ విలన్ ఉంటే హీరోకు అంత పేరు వస్తుంది. సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అందులో మిరాయ్ సినిమా బాగా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు.
సినిమా బలాలు మరియు బలహీనతలు
విలన్‌గా మంచు మనోజ్ పాత్ర బాగుంది. కానీ, అతని ప్లాష్‌బ్యాక్ పాయింట్ మాత్రం పెద్దగా ఆకట్టుకోదు. ఇక సినిమాకు ప్రధాన బలం కథ. అశోకుడు, తొమ్మిది గ్రంథాలు అనే కాన్సెప్ట్‌తో మంచి క్యూరియాసిటీ పెంచేశారు. దానికి తగినట్లుగా వచ్చే విజువల్స్, నెరేషన్ బాగుంది. అయితే, ఇలాంటి తరహా కాన్సెప్ట్స్ హాలీవుడ్ సూపర్ హీరో సినిమాల్లో ఇదివరకే వచ్చేశాయి.
కానీ, ఇండియన్ మైథాలజీకి సంబంధించి ఇలాంటి కాన్సెప్ట్ క్రియేట్ చేయడం మెచ్చుకోదగిన విషయం. ఫస్టాఫ్‌లో వచ్చే విజువల్స్, సీన్స్ మంచి ట్రీట్ ఇచ్చేలా ఉన్నాయి. అలాగే, లామా ఎంట్రీ అయితే అదిరిపోయింది. ఇక వీటిన మరింత హైలెట్ చేసేలా సంగీతం అద్భుతంగా కుదిరింది. కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అయితే మరికొన్నిచోట్ల బోర్ తెప్పించింది.
యాక్షన్ సీన్స్ బ్లాక్స్ అదిరిపోయాయి. ట్రైన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటుంది. అన్నింటికి మంచి పక్షితో వచ్చే యాక్షన్ సీన్ హైలెట్ అయింది. అయితే, హిమాలయాల్లోకి మిరాయ్ కోసం హీరో కష్టపడి వెళ్తున్నట్లు చూపించిన విజువల్‌గా అంత ఎఫెక్ట్ చూపించలేదు. డైరెక్టర్స్ కిశోర్ తిరుమల, వెంకటేష్ మహాతో వచ్చిన కామెడీ సీన్స్ కొన్నిచోట్ల వర్కౌట్ అయింది. మరికొన్ని చోట్ల క్లిక్ కాలేదు.
క్లైమాక్స్ గూస్‌బంప్స్ ఇచ్చేలా ఉంది. ఇక తేజ సజ్జా నటన చాలా బాగుంది. యూత్, ఓల్డ్ అంటూ తేడా లేకుండా అందరికి నచ్చేలా మెప్పించాడు. మంచు మనోజ్ విలనిజం ఆకర్షణగా నిలుస్తుంది. కనిపించేది తక్కువే అయిన స్టైల్ స్వాగ్‌తో మార్కులు కొట్టేశాడు. వీరి తర్వాత అంత ఇంపార్టెంట్ రోల్ చేసింది శ్రీయ సరన్ . కథ అంతా ఆమె చుట్టే సాగుతుంది.
అలాగే, ఆ పాత్రను డెప్త్‌గా ఫీల్ అయ్యేలా శ్రీయ సరన్ నటన ఉంది. తన సాలిడ్ పర్ఫామెన్స్‌తో అట్రాక్ట్ చేశారు. రితికా నాయక్ యాక్టింగ్ ఓకే. డబ్బింగ్‌లో లిప్ సింక్ కుదరలేదు. ఇక మిగతా పాత్రలు పర్వాలేదు. కథ, సినిమాటోగ్రఫర్‌గా కార్తీక్ ఘట్టమనేని ఫుల్ మార్స్క్ కొట్టేశారు. డైరెక్టర్‌గా కొన్ని ఫాల్స్ ఉన్నప్పటికీ మేజర్‌గా మెప్పించారు.
సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. కొన్ని చోట్ల ఏఐ విజువల్స్ క్లియర్‌గా తెలిసిపోయాయి. ఇక బీజీఎమ్ హైలెట్. ఎడిటింగ్ బాగుంది. ఫైనల్‌గా చెప్పాలంటే థియేట్రికల్ విజువల్ ట్రీట్ మూవీ మిరాయ్.
మొత్తం మీద, మిరాయ్ సినిమా సూపర్ హీరో జానర్ అభిమానులను అలరిస్తుంది. కథ, విజువల్స్, నటన బాగున్నాయి. కానీ కొన్ని చోట్ల కథనం బలహీనంగా ఉంది.


