|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Mirai Song : మళ్ళీ అదే పద్ధతి.. పాట సూపర్ హిట్.. సినిమాలో మాత్రం లేదు..

Published: 12-09-2025, 7:17 AM
Mirai Song : మళ్ళీ అదే పద్ధతి.. పాట సూపర్ హిట్.. సినిమాలో మాత్రం లేదు..

టాలీవుడ్ లో సినిమాకు ముందు రిలీజ్ అయ్యి హిట్ అయిన పాటలు సినిమాలో లేకపోవడం కొత్త ట్రెండ్ అవుతోంది. తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’ సినిమాలో కూడా ఇదే జరిగింది. ‘వైబ్ ఉంది బేబీ’ పాట సూపర్ హిట్ అయ్యింది కానీ…

రిలీజ్ ముందు హిట్ అయిన పాట

Mirai Song : ఇటీవల టాలీవుడ్ లో ఓ కొత్త ట్రెండ్ నడుస్తుంది. సినిమా నుంచి ముందే రిలీజయి హిట్ అయిన సాంగ్స్ సినిమాలో కనిపించడం లేదు. దేవర, గేమ్ ఛేంజర్, కింగ్డమ్, కుబేర.. ఇలా గత కొన్నాళ్లుగా ఆయా సినిమాల నుంచి రిలీజ్ కి ముందు వచ్చి హిట్ అయిన సాంగ్స్ తీరా థియేటర్ కి వెళ్లి చూస్తే సినిమాల్లో ఉండట్లేదు. ఇప్పుడు వచ్చిన మిరాయ్ సినిమా కూడా అదే పద్ధతి ఫాలో అయింది.(Mirai Song)

తేజ సజ్జ హీరోగా, మంచు మనోజ్ విలన్ గా తెరకెక్కిన మిరాయ్ సినిమా నేడు రిలీజయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్ కి ముందు ఈ సినిమా నుంచి ‘వైబ్ ఉంది బేబీ..’ అనే సాంగ్ వచ్చి పెద్ద హిట్ అయింది. ఆ సాంగ్ బాగా వినపడింది, సోషల్ మీడియాలో రీల్స్ బాగా చేసారు ఆ పాటకు. కానీ థియేటర్ కి వెళ్లి చూస్తే సినిమాలో ఆ పాట లేకపోవడం గమనార్హం.

సినిమాలో పాట లేకపోవడానికి కారణం

అయితే మిరాయ్ సినిమాలో సాంగ్ కోసం ప్లేసెమెంట్ ఉన్నా, సన్నివేశం వచ్చినా ఎడిటింగ్ లో తీసేసారు అని తెలుస్తుంది. అంతే కాకుండా ఈ సినిమాలో హీరోయిన్ రితిక నాయక్ ఒక సాధ్వి. సాధ్వితో ఇలాంటి సాంగ్ పెడితే బాగోదు అని పెట్టినట్టు లేరు. చివర్లో కూడా డివోషనల్ టచ్ తో ఎండ్ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఈ సాంగ్ వేస్తే డైవర్ట్ అవుతుందని ఎండ్ టైటిల్స్ లో కూడా వేయలేదు. మొత్తానికి ఈ సాంగ్ సినిమాలో లేకపోయినా ప్రమోషన్స్ కి బాగానే పనికొచ్చింది.

ప్రమోషన్స్ పై ప్రభావం

సినిమాలో మిస్ అయిన సాంగ్ ఇక్కడ చూసేయండి..

చివరగా, ‘వైబ్ ఉంది బేబీ’ పాట సినిమాకు ప్రమోషన్స్ లో బాగా ఉపయోగపడినప్పటికీ, సినిమాలో లేకపోవడం విశేషం. సినిమా యొక్క కథాంశం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.