|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మిరాయ్ హిందీ హక్కులు దక్కించుకున్న ప్రముఖ సంస్థ.. ఆనందంలో తేజ సజ్జా

Published: 14-08-2025, 8:10 AM
మిరాయ్ హిందీ హక్కులు దక్కించుకున్న ప్రముఖ సంస్థ.. ఆనందంలో తేజ సజ్జా

యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’ సినిమా హిందీ హక్కులను ప్రముఖ ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ దక్కించుకుంది. ఈ సినిమా సెప్టెంబర్ 5, 2025న విడుదల కానుంది.

Key Points

1

మిరాయ్ సినిమా హిందీ హక్కులు ధర్మ ప్రొడక్షన్స్ దక్కించుకుంది.

2

తేజ సజ్జా ఈ వార్తను సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.

4

కరణ్ జోహార్ సహకారంతో ఈ సినిమా హిందీలో విడుదల కానుంది.

మిరాయ్ హిందీ రిలీజ్ హక్కులు

బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘హనుమాన్’ తర్వాత యంగ్ హీరో తేజా సజ్జా నటిస్తున్న లేటెస్ట్ హై వోల్టెడ్ మూవీ ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్‌గా.. మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన ప్రతి అప్డేట్ ఆకట్టుకోగా.. రీసెంట్ వచ్చిన టీజర్, ఫస్ట్ సింగిల్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయింది. ఇక భారీ అంచనాల మధ్య ఈ ఏడాది సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం.. ప్రస్తుతం కన్నడలో వరుస ఇంటర్వ్యూస్ ఇస్తూ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా హిందీ రిలీజ్ హక్కులను ప్రముఖ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సొంతం చేసుకున్నట్లు తెలుపుతూ తేజా సజ్జా ఎక్స్ వేదికగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు. ‘మిరాయ్ కోసం కరణ్‌జోహర్ సర్ అండ్ లెజెండరీ ధర్మసినిమాలతో కలిసి పనిచేయడం గౌరవంగా ఉంది.. సెప్టెంబర్ 5, 2025 నుండి సూపర్ యోధగా మీ అందరినీ సినిమాల్లో కలుస్తా’ అంటూ తెలిపాడు. లింక్

ధర్మ ప్రొడక్షన్స్ సహకారం

తేజ సజ్జా ఆనందం

ధర్మ ప్రొడక్షన్స్ ద్వారా ‘మిరాయ్’ సినిమా హిందీలో విడుదల కానున్న విషయం తెలుగు సినీ ప్రేక్షకులను ఉత్సాహపరుస్తోంది. తేజ సజ్జా సహా చిత్ర యూనిట్ ఈ విజయానికి సంతోషం వ్యక్తం చేసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.