|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మిస్‌ వరల్డ్ 2025 గ్రాండ్‌ ఫినాలేలో రేవంత్‌రెడ్డి, చిరంజీవి, రానా, నమ్రత.. జాక్వెలిన్‌ రచ్చ వేరే లెవల్‌

Published: 31-05-2025, 12:24 PM
మిస్‌ వరల్డ్ 2025 గ్రాండ్‌ ఫినాలేలో రేవంత్‌రెడ్డి, చిరంజీవి, రానా, నమ్రత.. జాక్వెలిన్‌ రచ్చ వేరే లెవల్‌

మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలే హైదరాబాద్ లో అత్యంత వైభవంగా జరిగింది. తెలుగు సినీ తారలు, రాజకీయ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరై వైభవాన్ని పెంచారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, రేవంత్ రెడ్డి, రానా, నమ్రత శిరోద్కర్ లాంటి ప్రముఖులు పాల్గొన్నారు.

Key Points

1

మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలేలో ప్రముఖుల సందడి

2

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, చిరంజీవి, రానా హాజరు

4

భారత అమ్మాయి నందిని గుప్తా ఎలిమినేట్ అవడంతో ఆశలు నిరాశగా

ప్రముఖులతో వైభవంగా మిస్ వరల్డ్ 2025 ఫైనల్

మిస్‌ వరల్డ్ 2025 గ్రాండ్‌ ఫినాలే ఆద్యంతం వైభవంగా జరుగుతుంది. దాదాపు ఇరవై రోజులుగా జరుగుతున్న ఈ అందాల పోటీలు నేటితో ముగింపుకి చేరుకున్నాయి. ఇక ఇందులో మిస్‌ వరల్డ్ విన్నర్‌ ఎవరో తేలాల్సి ఉంది. ఇప్పటికే టాప్‌ 20 ని ఎంపిక చేశారు. వీరి నుంచి టాప్‌ 8న ఎంపిక చేయాల్సి ఉంది.

ఇదిలా ఉంటే ఈ ఈవెంట్‌లో సెలబ్రిటీలు సందడి చేశారు. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి తన సతీమణితో కలిసి హాజరయ్యారు. అలాగే మెగాస్టార్‌ చిరంజీవి ఇందులో మెరవడం విశేషం. ఆయన తన భార్య సురేఖతో కలిసి హాజరయ్యారు. దీంతో ఈవెంట్‌లో వీరు స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు.

జడ్జీలుగా సినీ తారలు, రాజకీయ నాయకులు

ఇక వీరితోపాటు రానా, నమ్రత శిరోద్కర్‌ కూడా ఇందులో పాల్గొనడం విశేషం. వీరు మిస్‌ వరల్డ్ 2025 ఫైనల్‌ విన్నర్‌ని ఎంపిక చేసే జ్యూరీలో ఉన్నారు. అలాగే ఐటీ సెక్రెటరీ కూడా ఇందులో భాగమయ్యాయి. ఇండియా నుంచి సుధా రెడ్డి కూడా ఇందులో స్థానం సంపాదించింది. మరోవైపు 2017 మిస్‌ వరల్డ్ విన్నర్‌ మనుషీ చిల్లర్ కూడా ఈ జడ్జ్ ల జాబితాలో ఉన్నాయి. ఇక స్టార్‌ నటుడు సోనూ సూడ్‌ సైతం ఈ జడ్జ్ ల లిస్ట్ లో ఉన్న విషయం తెలిసిందే.

మిస్‌ వరల్డ్ 2025 అందాల పోటీలకు తెలంగాణ వేదికైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని హైటెక్స్ లో ఈ వేడుకలు గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఫైనల్‌ ఈవెంట్ సైతం ఆద్యంతం వైభవంగా ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఫైనల్‌ ఎంపిక జరుగుతుంది. టాప్‌ 8 దశలోనే ఇండియాకి చెందిన నందిని గుప్తా ఎలిమినేట్ అయ్యింది. దీంతో భారతీయుల ఆశలు గల్లంతు అయ్యాయి. ఇప్పటి వరకు టాప్‌ 4న ప్రకటించారు. ఇందులో అమెరికా నుంచి మార్టినిక్యూ అందగత్తె, ఆఫ్రికా నుంచి ఇథియోపియా అందగత్తె, యూరప్‌ నుంచి పోలాండ్‌ సుందరి, ఆసియా నుంచి థాయిలాండ్‌ అమ్మాయి టాప్ 4లో నిలిచారు.

భారత అమ్మాయి ఎలిమినేషన్ తో ఆశలు అడియాసలు

ఇందులో సోనూ సూద్‌కి హ్యూమనేటేరియన్‌ అవార్డుని అందించారు. దీన్ని ఆయన సింగిల్‌ మదర్స్ కి అంకితమిస్తున్నట్టు వెల్లడించారు.

మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలే అంగరంగ వైభవంగా ముగిసింది. ప్రముఖుల హాజరు ఈ కార్యక్రమానికి మరింత వైభవాన్ని చేకూర్చింది. ఫలితాలు అభిమానులను ఆకట్టుకున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.