|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మిస్‌ వరల్డ్ 2025 టాప్‌లోకి దూసుకొచ్చిన మరో నలుగురు అందగత్తెలు.. ఫైనల్‌ ఎంపిక చేసే విధానం ఇదే

Published: 27-05-2025, 12:16 PM
మిస్‌ వరల్డ్ 2025 టాప్‌లోకి దూసుకొచ్చిన మరో నలుగురు అందగత్తెలు.. ఫైనల్‌ ఎంపిక చేసే విధానం ఇదే

మిస్ వరల్డ్ 2025 పోటీలలో మరో నలుగురు అందగత్తెలు టాప్ 40లో చోటు సంపాదించారు. ‘బ్యూటీ విత్ ఏ పర్పస్’ పోటీ ఫలితాలతో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఫైనల్ ఎంపిక ఎలా జరుగుతుందో తెలుసుకుందాం.

Key Points

1

మిస్ వరల్డ్ 2025 టాప్ 40లో నలుగురు అందగత్తెలు కొత్తగా చేరారు.

2

బ్యూటీ విత్ ఏ పర్పస్ పోటీల్లో విజేతలుగా నిలిచిన నలుగురు అందగత్తెలు టాప్ 40లో చోటు దక్కించుకున్నారు.

4

ఇండియా అందగత్తె నందిని గుప్తా ముందు వరుసలో ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బ్యూటీ విత్ ఏ పర్పస్ విజేతలు

మిస్‌ వరల్డ్ 2025 పోటీలు మరో నాలుగు రోజుల్లో ముగియనున్నాయి. దీంతో ఫైనల్‌ ఎంపిక ప్రాసెస్‌ జరుగుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే మొదటి క్వార్టర్ ఫైనల్‌లో భాగంగా టాప్‌40లో పది మంది అందగత్తెలు స్థానం సంపాదించారు. ఇప్పుడు కొత్తగా మరో ఇద్దరు చోటు దక్కించుకున్నారు. లేటెస్ట్ గా జరిగిన `బ్యూటీ విత్‌ ఏ పర్పస్‌`   పోటీల్లో నలుగురు అందగత్తెలు విన్నర్‌గా నిలిచారు. వీరిలో ఇద్దరు ఇప్పటికే టాప్‌ 40లో స్థానం సంపాదించుకోగా, కొత్తగా మరో ఇద్దరు ఈ జాబితాలో చేరారు.

`బ్యూటీ విత్‌ ఏ పర్పస్‌`లో ఆఫ్రికా ఖండం నుంచి ఉగాండాకి చెందిన నటాషా న్యోన్యోజి, అమెరికా ఖండం నుంచి ప్యూట్రో రికోకి చెందిన వలెరియా పెరెజ్‌, ఆసియా ఖండం నుంచి ఇండోనేషియాకి చెందిన మోనికా కేజియా సెంబిరింగ్, యూరప్‌ ఖండం నుంచి వేల్స్ అందగత్తె మిల్లే మియా ఆడమ్స్ విన్నర్‌గా నిలిచారు. వీరంతా టాప్‌ 40లో చోటు సంపాదించారు.

ఇప్పటికే ఇండియా అందగత్తె నందిని గుప్తా, అలాగే ఈస్తోనియాకి చెందిన ఎలిసే రాండ్మా, ఐర్లాండ్ కి చెందిన జాస్మిన గెర్హార్డ్, మార్టిన్‌క్యూకి చెందిన ఔరెల్లే జోవాచిమ్‌, నమీబియాకి చెందిన సెల్మా కమన్యా, త్రినిడాడ్‌ అండ్‌ టోబాగోకి చెందిన అన్నా లిసే నాంటన్‌, టర్కీకి చెందిన ఇడిల్ బిల్గెన్‌, జాంబియాకి చెందిన ఫెయిత్ బ్వాల్యా టాప్‌ 40 అందగత్తెల్లో చోటు సంపాదించిన విషయం తెలిసిందే.

టాప్ 40 నుండి ఫైనల్స్ వరకు ఎంపిక ప్రక్రియ

మరో మూడు దశల్లో ఫైనల్స్ జరగనున్నాయి. ఫస్ట్ క్వార్టర్‌ ఫైనల్‌లో భాగంగా ప్రస్తుతం టాప్‌ 40లో ఒక్కోఖండం నుంచి పది మంది అందగత్తెలను ఎంపిక చేస్తారు. టాప్‌ 20 కోసం వీరిలో ఒక్కో ఖండం నుంచి ఐదుగురుని ఎంపిక చేస్తారు. ఇది సెకండ్‌ క్వార్డర్‌ ఫైనల్‌.

ఆ తర్వాత సెమీ ఫైనల్‌ కోసం టాప్‌ 8 అందగత్తెలను ఎంపిక చేస్తారు. ఇందులో ఒక్కో ఖండం నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు. వీరంతా ఫైనల్‌లో పాల్గొంటారు. గ్రాండ్‌ ఫినాలేలో ఒక్క ఖండం నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసి, అంతిమంగా వారిలో ఒకరిని విన్నర్‌గా నిర్ణయిస్తారు. నలుగురిలో ఒకరు విన్నర్‌ అయితే, మిగిలిన ముగ్గురు రన్నరప్స్ గా నిలుస్తారు.

ఈ పోటీల్లో మన ఇండియా నుంచి పోటీ పడుతున్న రాజస్థాన్‌ అమ్మాయి నందిని గుప్తా ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ పోటీల్లో ఆరుసార్లు మన ఇండియాకి చెందిన అందగత్తెలు విన్నర్ గా నిలిచారు. ఇప్పుడు కూడా ఛాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి నందిని గుప్తా ఏ మేరకు సత్తా చాటుతుందో చూడాలి. హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా జరుగుతున్న ఈ మిస్‌ వరల్డ్ 2025 పోటీలకు సంబంధించిన గ్రాండ్‌ ఫినాలే మే 31న జరగబోతున్న విషయం తెలిసిందే.

నందిని గుప్తా అవకాశాలు

ఇక 108 దేశాలకు చెందిన అందగత్తెలు ఈ మిస్‌ వరల్డ్ పోటీల్లో పాల్గొనగా మే 12న హైదరాబాద్‌లోని హైటెక్స్ లో గ్రాండ్‌గా ప్రారంభమైన విషయం తెలిసిందే. సీఎం రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా ఈ ఈవెంట్‌ ప్రారంభమైంది. ఇక తెలంగాణ కల్చర్‌ని ప్రపంచానికి చాటి చెప్పే లక్ష్యంతోనే ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు.

అందులో భాగంగానే ఈ అందగత్తెలు మన తెలంగాణలోని టూరిస్ట్ ప్రదేశాలను సందర్శించి మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మన ఫుడ్‌, మన కట్టుబాట్లు, మన దుస్తులు, మన రాష్ట్రంలోని అందమైన ప్రదేశాలు, ఆథ్యాత్మిక కేంద్రాలను సందర్శించి ప్రపంచానికి ఎక్స్ ప్లోర్‌ చేసిన విషయం తెలిసిందే.

మిస్ వరల్డ్ 2025 పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. నందిని గుప్తా విజయం సాధిస్తుందో లేదో చూడాలి. ఫైనల్స్ లో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.