
📌 Key Points
- రాజేంద్రప్రసాద్-శ్రీకాంత్ హిట్ కాంబో తిరిగి కలిసింది
- వెంకటేశ్వరస్వామిగా రాజేంద్రప్రసాద్ మెప్పించనున్నారు
- లయ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కామెడీ, థ్రిల్
- జులై 17న విడుదల: ట్రైలర్ ఇప్పుడే చూడండి
గతంలో ఎన్నో సూపర్ హిట్ కామెడీ సినిమాల్లో కలిసి నటించిన శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్ మళ్లీ కలిసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ ట్రైలర్ విడుదలైంది.
హిట్ కాంబో రీయూనియన్: రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్
Mister Middle Class Trailer : గతంలో ఎన్నో సూపర్ హిట్ కామెడీ సినిమాల్లో కలిసి నటించిన శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్ ఇప్పుడు మరోసారి కలిసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అనే సినిమాతో జులై 17న రానున్నారు. బాలు J క్రియేషన్స్ బ్యానర్ పై కామెడీ సినిమాల దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో లయ హీరోయిన్ గా నటిస్తుంది.
వెంకటేశ్వరస్వామిగా రాజేంద్రప్రసాద్ స్పెషల్ లుక్
ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ వెంకటేశ్వరస్వామిగా, శ్రీకాంత్ ఆయన భక్తుడిగా కనిపించబోతున్నారు. డబ్బులు లేవని బాధపడే భక్తుడికి అనుకోకుండా ఎక్కువ డబ్బులు వస్తే వచ్చే కష్టాలు ఏంటి అని కామెడీతో పాటు ఎమోషనల్, థ్రిల్లర్ గా కూడా ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.
జులై 17న గ్రాండ్ రిలీజ్: ట్రైలర్ హిట్ అయ్యిందా?
మీరు కూడా ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ ట్రైలర్ చూసేయండి..
మిస్టర్ మిడిల్ క్లాస్ ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ సినిమా జులై 17న రిలీజ్ కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ట్యూన్ చేయండి.


