|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మ‌న‌సును క‌దిలించే అంద‌మైన ప్రేమ క‌థ‌.. నిజంగా ప్రేమ ఇంత గొప్పదా.? చ‌ల్ల‌టి వ‌ర్షంలాంటి మూవీ

Published: 19-04-2026, 2:35 AM
మ‌న‌సును క‌దిలించే అంద‌మైన ప్రేమ క‌థ‌.. నిజంగా ప్రేమ ఇంత గొప్పదా.? చ‌ల్ల‌టి వ‌ర్షంలాంటి మూవీ

మొదట చూసేటప్పుడు ఇది చాలా సాధారణమైన ప్రేమకథలా కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి గొడవపడే కిరణ్‌, ఐశ్వర్యల మధ్య జరిగే మార్పు ఈ కథకు బేస్‌. కానీ కథ ముందుకు సాగేకొద్దీ ప్రేమ అనేది ఎలా రూపాంతరం చెందుతుందో అర్థమవుతుంది. విడిపోయిన ఒక ప్రేమ కథ… మరో కొత్త ప్రేమకు దారి చూపించడం ఈ సినిమా ప్రత్యేకత. ఇది ఈ రోజుల్లో చూపిస్తున్న ప్రేమ క‌థ‌ల‌తో పోల్చితే చాలా మెచ్యూర్‌గా ఉంటుంది.

దీపికా – వంశీ ప్రేమ కథ ఈ సినిమాకు హార్ట్ లాంటిది. ఈ ట్రాక్ లేకపోతే కథ అంత బలంగా ఉండేది కాదు. ఒకరిపై ఒకరు ఎంత నిజాయితీగా ప్రేమిస్తారో, ఆ ప్రేమ కోల్పోయినప్పుడు ఎంత బాధ కలుగుతుందో ఈ భాగం చాలా హృదయాన్ని తాకేలా ఉంటుంది. ఈ ట్రాక్ వల్లే హీరో-హీరోయిన్ల మనసుల్లో మార్పు వస్తుంది.

మొదట ఒకరినొకరు అసహ్యించుకునే కిరణ్‌, ఐశ్వర్య… తర్వాత ఒక్క సంఘటనతో ఎలా దగ్గరవుతారో చాలా సహజంగా చూపించారు. అప్పటి వరకు తగాదాలు పడే ఈ జంట… ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకుంటూ ప్రేమలో పడటం ఈ సినిమాకు అందం. ఈ ట్రాన్సిషన్‌ చాలా రియల్‌గా అనిపిస్తుంది. ప్రేమ గొప్ప‌త‌నం ఏంటో ఈ స‌న్నివేశాలు చెబుతాయి.

ఈ సినిమాలో కామెడీ కూడా పెద్ద ప్లస్. ఇంటి యజమానుల పాత్రలు, కాలేజీ సన్నివేశాలు అన్నీ క‌లిసి సినిమాను ఎక్కడా బోర్ కొట్టనివ్వవు. శ్రీను వైట్ల మార్క్ సన్నివేశాలు ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. ఎన్నిసార్లు చూసినా అదే ఫన్ ఇస్తుంది. ఇప్పటి ట్రెండ్ కామెడీతో పోలిస్తే ఇది చాలా క్లిన్‌, సహజంగా నవ్వించే విధంగా ఉంటుంది.

ఈ సినిమా గురించి చెప్పాలంటే పాటలు తప్పనిసరిగా చెప్పాలి. దేవీశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం ఈ చిత్రానికి ఆత్మ అని చెప్ప‌డంలో సందేహం లేదు. మెలోడీ సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్ర‌తీ సీన్‌కి ఫీల్‌ను పెంచుతాయి. ఈ పాట‌లు ఇప్ప‌టికీ అదే ఫ్రెష్‌నెస్‌ను అందిస్తాయి. మొత్తం మీద ప్రేమ అంటే ఏమిటి? బాధ ఎంత లోతుగా ఉంటుంది? వంటి అంశాల‌ను ద‌ర్శ‌కుడు శ్రీను వైట్ల అద్భుతంగా చూపించాడు. ఈ ఎర్ర‌టి ఎండ‌లో చ‌ల్ల‌టి వ‌ర్షం లాంటి ఈ సినిమాను మ‌రోసారి చూసేయండి.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.