|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘మోగ్లీ’ కారణంగా అడవితో కనెక్ట్ అయ్యా

Published: 12-12-2025, 1:48 PM
‘మోగ్లీ’ కారణంగా అడవితో కనెక్ట్ అయ్యా
  • ‘మోగ్లీ’ జెన్యూన్, ప్యూర్ లవ్ స్టోరీ అని రోషన్ కనకాల తెలిపారు.
  • దర్శకుడు సందీప్ రాజ్ స్క్రీన్ ప్లే చాలా రేసీగా ఉంటుందని రోషన్ వివరించారు.
  • సినిమా షూటింగ్‌లో 60% ఫారెస్ట్‌లోనే, రియల్ లొకేషన్స్‌లో జరిగింది.
  • సినిమాకు అమ్మానాన్న సలహాలు చాలా బాగా వర్కౌట్ అయ్యాయని రోషన్ వెల్లడించారు.

హీరో రోషన్ కనకాల తన తాజా చిత్రం ‘మోగ్లీ’ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇది జెన్యూన్ లవ్ స్టోరీ అని, అడవి నేపథ్యంలో రూపొందించబడిన ఈ చిత్రం అందరికీ కనెక్ట్ అవుతుందని ఆయన తెలిపారు. సందీప్ రాజ్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించింది.

‘మోగ్లీ’: ప్యూర్ లవ్ స్టోరీ

‘మోగ్లీ’ జెన్యూన్ లవ్ స్టోరీ అని తెలిపాడు ఆ సినిమా హీరో రోషన్ కనకాల. కామెడీ, యాక్షన్.. ఇలా అన్ని ఎమోషన్స్ ఉన్నాయని.. మూవీ అందరికీ కనెక్ట్ అవుతుందని చెప్పాడు. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించగా.. టీజర్, పాటలు, ట్రైలర్‌తో స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ప్రీమియర్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా మాట్లాడిన రోషన్.. ‘ప్యూర్ అండ్ ఇన్నోసెన్స్ ఉండే లవ్ స్టోరీ. ఒక్క క్షణం కూడా బోర్ కొట్టకుండా డైరెక్టర్ సందీప్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే డిజైన్ చేశారు. స్క్రీన్ ప్లే చాలా రేసీగా ఉంటుంది. ఇందులో హానెస్ట్ లవ్ స్టోరీ ఉంటుంది. ఆ ప్రేమ కథని అద్భుతంగా పండించాడు. ఈ కథలో కామెడీ యాక్షన్ అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. చాలా ఆర్గానిక్, జెన్యూన్ గా రాశాడు’ అని తెలిపాడు. ఫారెస్ట్ బ్యాక్ గ్రౌండ్‌లో నడిచే సినిమాకు ప్రాక్టికల్‌గా చూసుకుంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కానీ తాను అన్ని ఎంజాయ్ చేస్తూ చేశానని… చేసే పనిని ప్రేమించి చేయడంతో అంతా సరదాగ గడిచిందన్నాడు.

60% ఆఫ్ షూటింగ్ ఫారెస్ట్‌లోనే చేశామని.. సినిమాలో అన్ని రియల్ లొకేషన్స్ ఉంటాయని.. ఈ సినిమా తర్వాత ఫారెస్ట్‌కు చాలా డీప్‌గా కనెక్ట్ అయ్యానని తెలిపాడు. ఈ సినిమాకు అమ్మానాన్న కొన్ని సజెషన్స్ ఇచ్చారని.. అవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయని వివరించాడు రోషన్. చిన్నప్పుడే సినిమా వాతావరణంలో ఉండడంతో సినిమా మీద తనకు ఒక ప్రేమ ఏర్పడిపోయిందని.. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిడి లేదని.. ఈ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నానని తెలిపాడు. ఇక బండి సరోజ్‌ ఈ కథకు చాలా పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యారని.. తమ మధ్య ఉండే సీన్స్ చాలా అద్భుతంగా ఉంటాయన్నాడు.

ఫారెస్ట్ షూటింగ్ అనుభవాలు

సినిమా పట్ల రోషన్ అభిరుచి

చిన్నప్పటి నుంచీ సినిమా వాతావరణంలో పెరిగిన రోషన్, తన ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నానని తెలిపారు. ‘మోగ్లీ’తో అడవికి మరింత దగ్గరయ్యానని, సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చిందని ఆయన అన్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.