
రోషన్ నటించిన ‘మోగ్లీ’ చిత్రం నుంచి గ్లింప్స్ త్వరలో విడుదల కానుంది. సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాక్షి మడోల్కర్ హీరోయిన్. మారేడుమిల్లి అడవిలో జరుగుతున్న షూటింగ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Key Points
మోగ్లీ చిత్రం నుండి గ్లింప్స్ త్వరలో విడుదల కానుంది.
మారేడుమిల్లి అడవిలో చిత్రీకరణ జరుగుతోంది.
హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌తో క్లైమాక్స్ ముగుస్తుంది.
రోషన్, సాక్షి మడోల్కర్ నటించిన ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి.
మోగ్లీ గ్లింప్స్ విడుదలకు సిద్ధం
సుమ కనకాల తనయుడు రోషన్(Roshan) నటిస్తున్న తాజా చిత్రం ‘మోగ్లీ’(Mogli). ‘కలర్ ఫొటో’ ఫేమ్ డైరెక్టర్ సందీప్ రాజ్(Sandeep Raj) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సాక్షి మడోల్కర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక దీనిని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్(TG Vishwa Prasad) నిర్మించనున్నాడు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ఫస్ట్ లుక్,టైటిల్ పోస్టర్ మూవీపై హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేశాయి. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి గ్లింప్స్(Glimps) రాబోతున్నాయంటూ మేకర్స్ ట్వీట్ చేస్తూ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫొటోస్ షేర్ చేశారు. ‘మోగ్లీ యొక్క మూడవ షెడ్యూల్ మారేడుమిల్లి అడవిలో హై-ఆక్టేన్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌తో ముగుస్తుంది.. త్వరలో గ్లింప్స్ డ్రాప్ అవుతోంది’ అని రాసుకొస్తూ ఆ అడవిలో షూటింగ్ జరుగుతున్న ఫొటోలను షేర్ చేశారు.
మారేడుమిల్లి అడవిలో షూటింగ్
యాక్షన్ సన్నివేశాలతో క్లైమాక్స్
మోగ్లీ చిత్ర యూనిట్ త్వరలో గ్లింప్స్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. అడవి నేపథ్యంలో చిత్రీకరించిన ఫోటోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.


