
📌 Key Points
- టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా సెమీ ఫైనల్‌కు చేరడంపై పాక్ మాజీ క్రికెటర్ల విమర్శలు.
- ఇండియా, వెస్టిండీస్ మ్యాచ్ ఫిక్సింగ్ అయిందని మహమ్మద్ అమీర్ ఆరోపణ.
- హెట్‌మెయర్ ఔట్ కాకపోయినా అంపైర్ ఔట్ ఇవ్వడంపై అమీర్ ఆగ్రహం.
- అంపైర్లు పక్షపాతంగా వ్యవహరించడం వల్లే టీమిండియా గెలిచిందని అమీర్ వాదన.
టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా సెమీ ఫైనల్‌కు చేరడంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇండియా, వెస్టిండీస్ మ్యాచ్ ఫిక్సింగ్ అయిందని మహమ్మద్ అమీర్ ఆరోపించడంతో ఇది మరింత వివాదాస్పదంగా మారింది.
టీమిండియా సెమీ ఫైనల్‌కు చేరడంపై పాక్ విమర్శలు
Mohammad Amir : టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో సెమీ ఫైనల్ కు టీమిండియా చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇండియా పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విషం కక్కుతున్నారు. ప్రతి మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యే జరిగిందని ఆరోపణలు చేస్తున్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు… ఇప్పుడు ఇండియా వర్సెస్ వెస్టిండీస్ ( India vs West Indies ) మ్యాచ్ ఉద్దేశించి కూడా హాట్ కామెంట్స్ చేశారు. ఈ మ్యాచ్ పై మహమ్మద్ అమీర్ (Mohammad Amir ) మాట్లాడుతూ… వెస్టిండీస్ ఆటగాడు షిమ్రోన్ హెట్‌మెయర్ ( Shimron Hetmyer) అసలు ఔట్ కాలేదని.. అంపైర్లు అమ్ముడుపోయారని ఫైర్ అయ్యారు. బ్యాట్ కు బంతి తగలకపోయినా, ఔట్ ఇచ్చారని ఆరోపణలు చేశారు. దీంతో మ్యాచ్ మొత్తం టీమిండియా చేతిలోకి వెళ్లిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిక్సింగ్ ( Match Fixing) జరగడం వల్లే, టీమిండియా నిన్న గెలిచిందని వింత వాదన తెరపైకి తీసుకువచ్చారు మహమ్మద్ అమీర్.
అంపైర్ల పక్షపాతం వల్లే భారత్ గెలిచిందా?
🚨 MASSIVE STATEMENT BY MOHAMMAD AMIR ON INDIA 🚨
“Hetmyer was clearly not out, mostly umpires are so much biased towards India in most of the ICC matches, and these small things really matter.” pic.twitter.com/wd3mAZO6hC
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసిన మహమ్మద్ అమీర్
— Cricket Central (@CricketCentrl) March 2, 2026
మొత్తానికి టీమిండియా విజయంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ చేసిన ఈ ఆరోపణలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రానున్న రోజుల్లో దీనిపై ఎలాంటి స్పందనలు వస్తాయో చూడాలి.


