
టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ఎన్టీఆర్‌కు తాను ద్రోహం చేశానంటూ నందమూరి బాలకృష్ణ ముందు ఒప్పుకున్నారు. ఈ షాకింగ్ నిజం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంలో చంద్రబాబు పాత్రపై మోహన్ బాబు ఏమన్నారంటే…
Key Points
మోహన్ బాబు సంచలన ఒప్పుకోలు: ఎన్టీఆర్‌కు ద్రోహం చేశానని బాలయ్య ముందు వెల్లడి.
చంద్రబాబు మాట విని ఎన్టీఆర్‌ను మోసం చేశానని మోహన్ బాబు ఆవేదన.
టీడీపీ రాజకీయాల్లో కీలక మలుపు, ఎన్టీఆర్ వెన్నుపోటుపై మరోసారి చర్చ.
బాలకృష్ణ ప్రశ్నలకు మోహన్ బాబు షాకింగ్ సమాధానాలు, పూర్తి వివరాలు వైరల్.
మోహన్ బాబు – బాలయ్య మధ్య సంచలన సంభాషణ
సీనియర్ ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించాడు. ఆ సమయంలో ఎన్టీఆర్‌తోనే ఉన్నాడు మోహన్ బాబు. ఆయన్ని నటుడిగా ప్రోత్సహించడమే కాదు, రాజకీయంగానూ లైఫ్ ఇచ్చాడు. కానీ మోహన్ బాబు ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచాడు. ఆయనకు ద్రోహం చేశాడు. చంద్రబాబు చెప్పిన మాట విని రామారావుని మోసం చేశాడట. ఈ విషయాన్ని బాలయ్య ముందు ఒప్పుకున్నారు మోహన్‌బాబు. అంతేకాదు తాను తప్పు చేశానని, అదే సమయంలో చంద్రబాబు మిస్టేక్ చేసినట్టు తెలిపారు. మరి ఆ కథేంటంటే?
ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన విషయం తెలిసిందే. పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఆయన అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రిగా అనేక విప్లవాత్మక మార్పులు, పథకాలు తీసుకొచ్చారు. జనం మెప్పించిన సీఎం అనిపించుకున్నారు. ఇప్పటికీ రామారావు ప్రవేశపెట్టిన పథకాలే అమలు అవుతున్నాయంటే అతిశయోక్తి కాదు. రెండు రూపాయలకే రేషన్ బియ్యం అనేది ఆయన తెచ్చిన పథకమే. సీఎంగా రాణించిన క్రమంలోనే ఆయన్ని టీడీపీలో కొందరు వెన్నుపోటు పొడిచారు. రెండు సార్లు సీఎం పీఠం నుంచి దించారు. పార్టీ, అధికారం అంతా లక్ష్మీ పార్వతి చేతుల్లోకి వెళ్తుందని, ఇకపై ఆమె చెప్పినట్టే మనం నడుచుకోవాల్సి వస్తుందని చెప్పి, చంద్రబాబు సమక్షంలోని మేజర్ గా ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ఎన్టీఆర్‌కి వ్యతిరేకంగా పార్టీని చీల్చి అధికారం చేపట్టారు. దీంతో రామారావు చాలా బాధపడ్డారు. తనకు వెన్నుపోటు పోవడంపై ఆయన చాలా కుంగిపోయారు.
ఎన్టీఆర్‌కు ద్రోహం వెనుక అసలు నిజం!
ఆ తర్వాత టీడీపీ పూర్తిగా చంద్రబాబు నాయుడి కంట్రోల్‌లోకి వెళ్లింది. నందమూరి ఫ్యామిలీ కూడా చంద్రబాబు వెంటనే ఉన్నారు. సొంత తండ్రినే దూరం పెట్టారు. అయితే ఈ విషయంలో భిన్న వాదనలు ఉన్నాయి. ఎన్టీఆర్‌కి చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని కొందరు అంటుంటే, లక్ష్మీ పార్వతి కారణంగా పార్టీని కాపాడుకోవడం కోసం చంద్రబాబు అలా చేయాల్సి వచ్చిందనేది మరికొందరి వాదన. బాలయ్య కూడా దీన్నే సమర్థిస్తుంటారు. అందుకే బావ సైడ్ ఉన్నాడు. అయితే ఇదే విషయం బాలకృష్ణ, మోహన్ బాబు మధ్య చర్చకు వచ్చింది. మోహన్ బాబుని బాలయ్య ప్రశ్నించారు. ఆ రోజు నాన్నగారి వెంట ఎందుకు లేరు, ఆయనకు ఎందుకు ద్రోహం చేశారు, పార్టీ ఎందుకు మారారు అని బాలయ్య ప్రశ్నించాడు.
దీనికి మోహన్ బాబు స్పందిస్తూ షాకింగ్ కామెంట్ చేశాడు. సంసార జీవితంలోగానీ, నిజ జీవితంలో గానీ ఎప్పుడూ సక్రమంగా ఉన్నా, ఏదో టైమ్ లో సడెన్‌గా దెబ్బతగులుతుంది. ఆ సమయంలో చంద్రబాబు మాటలు విని అన్నయ్యని కాదనుకొని వచ్చాను. ఈ విషయం తెలిసి నా ఫ్రెండ్ రజనీకాంత్.. ఏరా అన్నయ్యకి ద్రోహం చేశావని మందలించాడు. ఆ తర్వాత నేను, రజనీకాంత్ అన్నయ్య వద్దకు వెళ్లాం. ఆయనకు విషయం చెప్పే లోపే, ఏం బ్రదర్ మీరు కూడానా అన్నారు. ఆ మాటతో ఇంకా ఏం మాట్లాడలేకపోయాం. ఏదో మాట్లాడి వచ్చేశాం, వచ్చాక చంద్రబాబుని నేను ఇది కావాలి, అది కావాలని ఏదీ అడగలేదు. కానీ చంద్రబాబు మిస్టేక్ చేశాడు.
చంద్రబాబు పాత్రపై మోహన్ బాబు ఏమన్నారంటే..?
కాలం గడిచిపోయింది. అన్నయ్య వెళ్లిపోయారు. ఇప్పుడు చంద్రబాబు గురించి చెడుగా అనకూడదు. నా బంధువు, అతను బాగుండాలి, క్షేమంగా బతకాలి. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకు ఆయన నన్ను క్రమశిక్షణ లేదని అన్నాడు. ఏ మహానుభావుడు అన్నయ్య క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని బిరుదు ఇచ్చాడో, చంద్రబాబు క్రమశిక్షణ లేదని బయటకు పంపించాడు` అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు మోహన్‌బాబు. బాలయ్య నిర్వహించిన అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షో గత సీజన్ లో పాల్గొన్న కలెక్షన్ కింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మోహన్ బాబు చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు తెలుగు రాజకీయాల్లో, సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మరిన్ని ఆసక్తికర విషయాలు, తాజా అప్‌డేట్‌ల కోసం మా ఛానెల్‌ని ఫాలో అవ్వండి.
