|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Akhanda 2: అఖండ 2 సెన్సార్ రివ్యూ.. బాలయ్య-బోయ కాంబోలో మరో సంచలనం కన్ఫర్మ్..

Published: 01-12-2025, 11:50 PM
Akhanda 2: అఖండ 2 సెన్సార్ రివ్యూ.. బాలయ్య-బోయ కాంబోలో మరో సంచలనం కన్ఫర్మ్..
  • అఖండ 2కు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది.
  • హై వోల్టేజ్ యాక్షన్, డివోషనల్ ఎలిమెంట్స్ తో సినిమా అదరగొట్టిందని సెన్సార్ టాక్.
  • ఇంటర్వెల్ బ్లాక్, అఘోర ఎంట్రీ, హిమాలయాల సీన్స్ ముఖ్యమైన హైలెట్స్.
  • క్లైమాక్స్ ట్విస్ట్ తో పాటు అఖండ 3కి లీడ్ ఉంటుందని సమాచారం.

నందమూరి బాలకృష్ణ తన హిట్ ట్రాక్ ను అఖండ 2తో కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ అందుకుంది. హై వోల్టేజ్ యాక్షన్, డివోషనల్ అంశాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 5న విడుదల కానుంది.

అఖండ 2 సెన్సార్ టాక్: హై వోల్టేజ్ యాక్షన్

Akhanda 2: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యమ స్పీడ్ లో ఉన్నారు. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ సీనియర్ హీరోలలో టాప్ పొజిషన్ లో ఉన్నాడు. కేవలం సినిమాలు చేయడమే అక్కడ తరువాత వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. అఖండ, భగవంత్ కేసరి, వీరసింహా రెడ్డి, డాకు మహారాజ్. సీనియర్ హీరోలలో ఈ రికార్డ్ ఎవరికీ లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇప్పుడు ఆ హిట్ ట్రాక్ ను కంటిన్యూ చేయడానికి అఖండ 2(Akhanda 2)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు బాలకృష్ణ. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ డివోషనల్ మాస్ ఎంటర్టైనర్ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tamil Star: తెలుగు సినిమాకి రూ.50 కోట్లు ఇవ్వాల్సిందే.. డిమాండ్ చేస్తున్న తమిళ స్టార్.. రెండు హిట్స్ ఇచ్చాడు మరి..

బాలయ్య-బోయపాటి కాంబోలో మరో సంచలనం

ఈనేపథ్యంలోనే తాజాగా అఖండ 2 సినిమాను సెన్సార్ కి పంపించారు మేకర్స్. సెన్సార్ వాళ్ళు ఈ సినిమా U/A సర్టిఫికెట్ ను జారీ చేశారు. అంతేకాదు, సినిమా చూసిన తరువాత సెన్సార్ సభ్యుల నుంచి అభినందనలు అందుకున్నారట మేకర్స్. సెన్సార్ సభ్యులు చెప్పినదాని ప్రకారం అఖండ 2 సినిమా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ విత్ గుడ్ డివోషనల్ ఎలిమెంట్స్. బోయపాటి ప్రతీ సినిమాల్లొ లాగే టైటిల్ కార్డు అదిరిపోగా బాలకృష్ణ ఎంట్రీ మాస్ ఆడియన్స్ కి పీక్స్ నచ్చుతుందట. మధ్యలో వచ్చే యాక్షన్ బ్లాక్స్, బాలయ్య మాస్ డైలాగ్స్ కూడా అదిరిపోతాయట.

సినిమా హైలెట్స్: ఇంటర్వెల్, అఘోర సీన్స్

ఇక ఇంటర్వెల్ లో వచ్చే 20 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ సినిమాకె హైలెట్ గా నిలువనుందట. ఆ తరువాత అఘోర ఎంట్రీ, హిమాలయాల సీన్స్, అక్కడ ఫైట్ సీక్వెన్స్, కుంభమేళా సీన్స్ చాలా హైలెట్ కానున్నాయట. ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవడం ఖాయం అని టాక్ వస్తోంది. ఇక ఈ సినిమా ఎండింగ్ లో అఖండ 3కి లీడ్ ఇస్తూ ముగించారట. ఇక సెన్సార్ నుంచి పాజిటీవ్ టాక్ రావడంతో మేకర్స్ చాలా హ్యాపీగా ఉన్నారట. అలాగే డిసెంబర్ 5న కూడా అదే పాజిటీవ్ రెస్పాన్స్ వస్తుంది అని మేకర్స్ ధీమాగా ఉన్నారు. మరి విడుదల తరువాత ఈ సినిమా ఎలాంటి సంచలనం క్రియేట్ చేస్తుందో చూడాలి.

సెన్సార్ నుంచి అఖండ 2కి పాజిటివ్ టాక్ రావడంతో మేకర్స్ ధీమాగా ఉన్నారు. బాలయ్య-బోయపాటి కాంబోలో ఈ చిత్రం మరో సంచలనం సృష్టించడం ఖాయమని అంచనా. డిసెంబర్ 5న విడుదల తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.