|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలోకి డబ్ల్యూడబ్ల్యూఈ జాన్ సీనా సూపర్ హీరో సిరీస్.. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్.. మిస్ కాకుండా చూసేందుకు 4 కారణాలు

Published: 15-08-2025, 5:46 AM
ఓటీటీలోకి డబ్ల్యూడబ్ల్యూఈ జాన్ సీనా సూపర్ హీరో సిరీస్.. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్.. మిస్ కాకుండా చూసేందుకు 4 కారణాలు

డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ జాన్ సీనా నటించిన ‘పీస్‌మేకర్’ సీజన్ 2 ఓటీటీలోకి రాబోతుంది. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌లో జాన్ సీనా కొత్త కోణాన్ని చూపించనున్నాడు.

Key Points

1

జాన్ సీనా నటనతో అదిరే యాక్షన్, రొమాన్స్!

2

DC యూనివర్స్‌తో అద్భుతమైన కనెక్షన్!

4

పీస్‌మేకర్ మరియు ఎమిలియా హార్కోర్ట్ మధ్య రొమాన్స్!

జాన్ సీనా తిరిగి వస్తున్నాడు!

డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ గా ఇండియాలోని అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు జాన్ సీనా. యాక్టింగ్ లోనూ అదరగొడుతున్నాడు. తాజాగా అతను మళ్లీ తన మెరిసే హెల్మెట్ తో తిరిగి ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ లో అదిరిపోయే యాక్షన్ తో పాటు, ఘాటెక్కించే రొమాంటిక్ సీన్లతో కూడిన పీస్ మేకర్ సీజన్ 2 సిరీస్ తో ఓటీటీలోకి రాబోతున్నాడు.

పీస్ మేకర్ గా జాన్ సీనా తిరిగి వస్తున్నాడు. పీస్‌మేకర్ సీజన్ 2 ఆగస్టు 22న డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ఇది జియోహాట్‌స్టార్‌ లోకి రానుంది. ఓటీటీ లోకి జాన్ సీనా పీస్ మేకర్ సీజన్ 2 వస్తుంది. ఇది మిమ్మల్ని మరో కోణంలో ఆకట్టుకునే రివేంజ్ డ్రామా. పీస్‌మేకర్ సీజన్ 2ని ఎందుకు మిస్ అవ్వకూడదో ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి.

ఫ్రాంక్ గ్రిల్లో రిక్ ఫ్లాగ్ సీనియర్‌గా తిరిగి రావడంతో పీస్‌మేకర్ సీజన్ 2 డీసీ యూనివర్స్ (DCU)లో ఒక ముఖ్యమైన కథగా మారింది. క్రియేచర్ కమాండోస్ (2024) సిరీస్‌లో పరిచయమైన ఒక ప్రధాన పాత్ర కూడా జేమ్స్ గన్ సూపర్‌మ్యాన్ సినిమాలో కనిపిస్తుంది. ఈ సిరీస్ తో డీసీ యూనియర్స్ లో ప్రతీది ఎలా కనెక్ట్ అయిందో ఈ సిరీస్ చూపిస్తుంది.

డీసీ యూనివర్స్ కనెక్షన్

సూపర్‌మ్యాన్ సినిమాకు కొనసాగింపు

జేమ్స్ గన్ తెరకెక్కించిన సూపర్‌మ్యాన్ సినిమా పీస్‌మేకర్ సీజన్ 2కి ప్రీక్వెల్‌గా పనిచేస్తుంది. గత సంఘటనల తర్వాత ఏమి జరిగిందో వివరిస్తుంది. జేమ్స్ గన్ గతంలో ది హాలీవుడ్ రిపోర్టర్‌తో మాట్లాడుతూ, రెండవ సీజన్‌లో సినిమాలో పరిచయం చేసే పాత్రలు, కథాంశం కూడా ఉంటాయని, ఇందులో మాక్స్‌వెల్ లార్డ్ ద్వారా నిధులు సమకూర్చిన జస్టిస్ లీగ్ సమీప జట్టు అయిన ది జస్టిస్ గ్యాంగ్ కూడా ఉంటుందని తెలిపారు.

భావోద్వేగాలు మరియు రొమాన్స్

పీస్ మేకర్ సీజన్ 2 లో హీరోను వైలెన్స్ తో కూడిన క్యారెక్టర్ లో చూపించడం కంటే కూడా అతని ఎమోషన్ ను బయట పెట్టబోతున్నారు. ఈ సిరీస్ అతని భావోద్వేగ కోణాన్ని, అతను ఎలా మంచి వ్యక్తిగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడో అనే దాన్ని దగ్గరగా చూపిస్తుంది. ఈ కథ అతని గతాన్ని ఎదుర్కొంటూ, గాయాలను నయం చేయడానికి ఒక మార్గాన్ని కనుగొనే అతని ప్రయాణాన్ని అనుసరిస్తుంది.

పీస్ మేకర్ సీజన 2లో రొమాన్స్, లవ్ కూడా ఎక్కువగానే ఉండనుంది. పీస్‌మేకర్, ఎమిలియా హార్కోర్ట్ మధ్య శృంగార కథను చూడాలని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూసేలా ట్రైలర్ నుండి ఇప్పటికే కొన్ని సూచనలు అందాయి. కొత్త సీజన్ సూపర్ హీరో ఒక ప్రత్యామ్నాయ ప్రపంచంలో ప్రేమను కనుగొన్నట్లు కూడా చూపిస్తుంది. మొదటి సీజన్‌లో వారి వృత్తిపరమైన సంబంధాలు ఎక్కువగా కనిపించగా, రెండవ సీజన్ వారి సంబంధంలోకి లోతుగా వెళ్తుందని భావిస్తున్నారు.

జాన్ సీనా అభిమానులకు ఇది పండగే. యాక్షన్, రొమాన్స్, భావోద్వేగాలతో నిండిన ఈ సిరీస్‌ను మిస్ కావద్దు. జియో హాట్‌స్టార్‌లో ఆగస్టు 22న చూడండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.