|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

భాషా తరహాలో MIB.. సమంత సినిమాపై డైరెక్టర్ వైరల్ కామెంట్స్

Published: 11-06-2026, 4:32 PM
భాషా తరహాలో MIB.. సమంత సినిమాపై డైరెక్టర్ వైరల్ కామెంట్స్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ (MIB) సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూన్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ మూవీ బృందం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘U/A’ సర్టిఫికెట్ జారీ చేసినట్లు మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలను గమనిస్తే ఈ సినిమాలో సమంత యాక్షన్ సన్నివేశాల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో తాజా ఇంటర్వ్యూలో డైరెక్టర్ నందిని రెడ్డి ఈ సినిమాపై చేసిన కామెంట్స్ మరిన్ని ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచుతున్నాయి. ‘ఈ సినిమాలో సమంత పెర్ఫార్మన్స్ చాలా హైలైట్‌గా ఉంటుంది. మా ఇంటిబంగారం సినిమా ‘బాషా’ లాంటి చిత్రం!. ‘బాషా’ తరహా కథా విధానంపై ఇది ఆధారపడి ఉంటుంది.. ఇందులో ప్రధాన పాత్రకు ఒక గతం ఉంటుంది. మేము ఆ విధానంలో చిన్న మార్పులు చేసి, అదే పాత్రలో ఒక మహిళ ఉంటే కథ ఎలా ఉంటుందో ఆవిష్కరించాము. మా ఇంటిబంగారం చిత్రంతో సరికొత్త సమంతను చూస్తాను’ అని తెలిపారు.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.