|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Thankyou Subbarao Trailer : ‘థాంక్యూ సుబ్బారావు’ ట్రైలర్ రిలీజ్.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

Published: 15-06-2026, 4:46 PM
Thankyou Subbarao Trailer : ‘థాంక్యూ సుబ్బారావు’ ట్రైలర్ రిలీజ్.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?

Thankyou Subbarao Trailer : ఓ పిట్టకథ, అన్నపూర్ణ ఫోటో స్టూడియో, రేపు ఉదయం పది గంటలకు.. వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు చెందు ముద్దు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో ‘థాంక్యూ సుబ్బారావు’ అనే కొత్త సినిమా రానుంది. కె రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో కుర్ర పొడక్షన్స్ బ్యానర్ పై దినేష్ కుర్ర నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.

చంద్రహాస్ కోట్ల, లావణ్య సాహుకార, రోహిత్ రెడ్డి యర్రంరెడ్డి, మురళీధర్ గౌడ్.. పలువురు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్ని పోషించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించారు. కామెడీ, యాక్షన్, లవ్, సస్పెన్స్, థ్రిల్ ఇలా అన్ని అంశాల్ని జోడించి ‘థాంక్యూ సుబ్బారావు’ని తెరకెక్కించారు. ఈ సినిమా జూన్ 18 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

మీరు కూడా థ్యాంక్యూ సుబ్బారావు ట్రైలర్ చూసేయండి..

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.