|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sravanthi Pepakayala : ఐటీ ఫీల్డ్‌లో కమిట్మెంట్స్.. మా మేనేజర్ నన్ను.. లేటెస్ట్ సెన్సేషన్ శ్రవంతి వ్యాఖ్యలు వైరల్

Published: 15-06-2026, 4:46 PM
Sravanthi Pepakayala : ఐటీ ఫీల్డ్‌లో కమిట్మెంట్స్.. మా మేనేజర్ నన్ను.. లేటెస్ట్ సెన్సేషన్ శ్రవంతి వ్యాఖ్యలు వైరల్

Sravanthi Pepakayala : శ్రవంతి పేపకాయల.. ఇటీవల సోషల్ మీడియాలో గోదావరి అమ్మాయి అంటూ రీల్స్ తో ఒక్కసారిగా సెన్సేషన్ అయి ఫేమ్ తెచ్చుకుంది. వెబ్ సిరీస్ లు, సినిమాల్లో కూడా ఇప్పుడిప్పుడే అవకాశాలు తెచ్చుకుంటుంది ఈ గోదావరి అమ్మాయి. తాజాగా శ్రవంతి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తను గతంలో సాఫ్ట్ వేర్ జాబ్ చేసేటప్పుడు ఎదుర్కున్న ఓ సంఘటన గురించి చెప్పింది.

శ్రవంతి మాట్లాడుతూ.. ఐటీలో మా మేనేజర్ ఉండేవాడు. మా మేనేజర్ కి ఒక కొడుకు ఉన్నాడు. స్కూల్ కి వెళ్లే ఏజ్. అయినా మా మేనేజర్ నన్ను టార్చర్ చేసేవాడు. మెసేజ్, కాల్స్ చేసేవాడు. మా టీమ్ లో ఎవరికీ మెసేజ్ చేసేవాడు కాదు నాకు మాత్రమే చేసేవాడు. మేనేజర్ నాకు మెసేజ్ చేస్తున్నాడని ఎలా తెలిసిందో ఫ్లోర్ లో అందరికి తెలిసింది. నాకు అది ఇష్టం ఉండేది కాదు. నేను వర్క్ బాగా చేసేదాన్ని. మేనేజర్ వల్లే నేను టాప్ లో ఉన్నాను అనే మాట వచ్చేస్తుంది అనిపించింది. అందుకే నేను మేనేజర్ ని బాగా ఇగ్నోర్ చేశా. మొహం మీద చెప్పేశా మీరు నాతో మాట్లాడొద్దు, నువ్వెవరు నాతో మాట్లాడటానికి అని ఓ రోజు గట్టిగా ఇచ్చేసా.

మా అమ్మకు చెప్పా. ఇలా మేనేజర్ ఇబ్బంది పెడుతున్నాడు అంటే మా అమ్మ జాబ్ లోంచి తీసేస్తారేమో అని భయపడేది. ఐటీలో మనకు తెలియకుండా చాలా జరుగుతాయి. చాలామంది కమిట్మెంట్స్ అడుగుతారంట. నన్ను ఎవరూ అడగలేదు కానీ నేను ఫేస్ చేశాను అలాంటివి. ఆ మేనేజర్ కి ఒక కొడుకు ఉండి కూడా రోజూ అవసరం లేకపోయినా కాల్ చేసేవాడు. అది నాకు అర్ధమయిపోయింది. కానీ మన దగ్గర నిజంగా ట్యాలెంట్ ఉంటే, మీ దగ్గర కాకపోతే ఇంకో దగ్గర బతుకుతా అని చెప్పే ధైర్యం ఉంటే ఇలాంటి వాళ్ళు ఏం చేయలేరు అని చెప్పుకొచ్చింది.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.