|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కేరళలో వింత ఘటన.. ఒకే ఇంట్లో బయటపడ్డ 18 కొండచిలువలు!

Published: 11-06-2026, 4:32 PM
కేరళలో వింత ఘటన.. ఒకే ఇంట్లో బయటపడ్డ 18 కొండచిలువలు!

కేరళలోని త్రిస్సూర్ జిల్లా పూంకున్నంలో ఒకే ఇంట్లో 24 గంటల వ్యవధిలో ఏకంగా 18 కొండచిలువలు బయటపడటం తీవ్ర కలకలం రేపింది. అటవీ శాఖ అధికారులు, స్వచ్ఛంద సేవా సిబ్బంది సకాలంలో స్పందించి వాటిని సురక్షితంగా రక్షించారు. తొలుత రాత్రి వేళ జరిపిన తనిఖీల్లో అత్యంత విషపూరితమైన, ప్రమాదకరమైన 10 ‘మలబార్ పిట్ వైపర్’ కొండచిలువలు జాతి పాములు పట్టుబడ్డాయి.

మరుసటి రోజు ఉదయం అధికారులు మళ్లీ తనిఖీలు చేపట్టగా, మరో 8 పాములు బయటపడ్డాయి. వీటిలో కొన్ని పాములు ఇంటి ఆవరణలో పార్క్ చేసి ఉన్న స్కూటర్‌లో కూడా దాక్కోవడం గమనార్హం. ఆ ప్రాంతంలో ఒకే రోజు, ఒకే ఇంట్లో ఇన్ని పాములు లభించడం ఇదే తొలిసారి అని అటవీ శాఖ అధికారులు తెలిపారు. పట్టుబడిన సర్పాలన్నింటినీ ఎలాంటి హాని తలపెట్టకుండా సురక్షితమైన అటవీ ప్రాంతానికి తరలించారు. అసలు ఒకే చోట ఇన్ని పాములు చేరడానికి గల కారణాలపై (అనుకూల వాతావరణం, ఆహార లభ్యత లేదా దాక్కోవడానికి ఉన్న వసతులు) అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.