|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మూసీకి ఊపిరి: మీ ఆలోచనలే ప్రాజెక్టుకు ఊపిరి.. తుది గడువు ఎప్పుడంటే?

Published: 31-03-2026, 8:35 AM
మూసీకి ఊపిరి: మీ ఆలోచనలే ప్రాజెక్టుకు ఊపిరి.. తుది గడువు ఎప్పుడంటే?
  • మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో ప్రజల భాగస్వామ్యం కోసం ఏప్రిల్ 15 వరకు అభిప్రాయాల సేకరణ.
  • ప్రజల సూచనలను [email protected]కు పంపాలని మంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి.
  • ప్రజావాణిలో ప్రజల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశం.
  • ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, భూరికార్డుల సమస్యలపై ప్రజావాణిలో వినతులు స్వీకరించబడ్డాయి.

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి అభిప్రాయాలను స్వీకరించాలని నిర్ణయించారు. మరోవైపు ప్రజావాణిలో ప్రజల సమస్యలను పరిష్కరించాలని మంత్రి పొన్నం అధికారులను ఆదేశించారు.

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడారు. మూసీ పునరుజ్జీవ పనులు పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో, పారదర్శకంగా కొనసాగుతాయన్నారు.

ఈ ప్రాజెక్టులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు మార్చి 31 నుండి ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్ ద్వారా అభిప్రాయాల సేకరణ చేపడుతున్నామని భట్టి చెప్పారు. ప్రజలు తమ సూచనలను [email protected] మెయిల్ ఐడీకి పంపవచ్చన్నారు. ప్రజల నుండి వచ్చే ప్రతి విలువైన సూచనను అధికారులు విశ్లేషిస్తారని తెలిపారు.

‘అవసరమైన పక్షంలో సూచనలు చేసిన వారితో సబ్ కమిటీ సభ్యులు నేరుగా భేటీ అవుతారు. నిర్మాణ డిజైన్లు, పునరావాసం, డిఫెన్స్ అంశాలు, బ్యాంకర్లతో చర్చల వంటి కీలక పనులను సమన్వయంతో వేగవంతం చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని మా ప్రభుత్వం, ప్రజల ఆలోచనలు, అవసరాలకు అనుగుణంగా మూసీ పునరుజ్జీవ ప్రణాళికలు రూపొందించి, ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడానికి కట్టుబడి ఉంది.’ అని భట్టి విక్రమార్క చెప్పారు.

ప్రజావాణిలో ప్రజల సమస్యలపై వినతులు స్వీకరణ

అంతకుముందు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో ప్రజావాణి కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ప్రజావాణి కార్యక్రమంలో సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రాలు ఇవ్వడానికి వచ్చిన ప్రజలతో వారి సమస్యలపై అడిగి తెలుసుకున్నారు.. ప్రజావాణిలో ఫిర్యాదుల ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని బాధితులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రజావాణిలో ముఖ్యంగా ఇల్లు లేని వారు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, పింఛన్లు, ధరణి ద్వారా భూరికార్డుల్లో సమస్యలు భూ భారతిలో సమస్యల పరిష్కారంపై అధికారులతో మాట్లాడారు. ప్రజావాణి ఫిర్యాదులపై సమస్యలు పరిష్కారం అయ్యేలా అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు.

సమస్యల పరిష్కారానికి అధికారులకు మంత్రుల ఆదేశాలు

ఆర్టీసీ లో వివిధ కారణాల వల్ల శాశ్వతంగా రిమూవ్ అయిన వారు తమ ఉద్యోగాలు సర్వీసులోకి తీసుకోవడంపై త్రిమెన్ కమిటీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి తో మాట్లాడుతూ.. ప్రజావాణిలో వస్తున్న దరఖాస్తు లు, వాటి పరిష్కారంపై చర్చించారు. పోలీస్ కేసులకు సంబంధించిన వాటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు మంత్రి పొన్నం.

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.

హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More

మొత్తానికి, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుతోంది. ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. అధికారులు సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని మంత్రులు సూచించారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.