|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కామెడీ షోలో మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు.. యాక్షన్‌లోకి జాతీయ మహిళా కమిషన్

Published: 11-06-2026, 4:31 PM
కామెడీ షోలో మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు.. యాక్షన్‌లోకి జాతీయ మహిళా కమిషన్

కామెడీ పేరుతో మహిళలను కించపరిచేలా, వారిపై జరిగే లైంగిక వేధింపులను (Sexual Coercion) సమర్థిస్తూ మాట్లాడే ధోరణిపై జాతీయ మహిళా కమిషన్ (NCW) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హర్యానాలోని గురుగ్రామ్‌లో జరిగిన ఓ స్టాండప్ కామెడీ షోలో, మహిళల పట్ల బలవంతపు లైంగిక ప్రవర్తనపై‌ పంచ్‌లు వేయగా.. అందుకు ప్రేక్షకులు చప్పట్లు కొట్టడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో జాతీయ మహిళా కమిషన్ మొత్తం వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించింది.

మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్.. సదరు షోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమెడియన్లు ప్రణీత్ మోరే (Pranit More), హిమాన్షు జంగ్రా (Himanshu Jangra)లపై చర్యలకు ఉపక్రమించింది. ఈ ఇద్దరికీ కమిషన్ విచారణ నోటీసులు (Hearing Notices) జారీ చేసింది. జూన్ 22న సాయంత్రం 4 గంటలకు కమిషన్ ఎదుట స్వయంగా విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.