|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కుక్కలు అర్ధరాత్రి పూట మొరిగితే దాని అర్థం ఏమిటి? ఇలా శునకాన్ని చూస్తే శుభం!

Published: 15-06-2026, 4:46 PM
కుక్కలు అర్ధరాత్రి పూట మొరిగితే దాని అర్థం ఏమిటి? ఇలా శునకాన్ని చూస్తే శుభం!

కుక్కల అరుపులు, వాటి ప్రవర్తన కేవలం సహజమైన జంతు ప్రవృత్తులు కావచ్చు. కానీ మతపరమైన, సాంప్రదాయ దృక్కోణం నుండి చూస్తే వాటికి స్వంత వేర్వేరు అర్థాలు ఉన్నాయి. అవేంటో చూడండి.

ఇప్పటికీ ఊర్లలో చాలా విషయాలు నమ్ముతుంటారు. అర్ధరాత్రి కుక్క మెురగడం, లేదా నేలను పదే తవ్వడంలాంటి విషయాలను చూసినప్పుడు పెద్దలు ఏదో ఒక విషయం చెబుతుంటారు. సంప్రదాయాలు, నమ్మకాలలో జంతువులకు, పక్షులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా అర్ధరాత్రి వేళల్లో కుక్కలు గుంపుగా చేరి వింతగా మొరగడం గమనించి ఉండవచ్చు. ఇది కేవలం యాదృచ్ఛికమేనా లేక దీని వెనుక ఏదైనా రహస్యం ఉందా అని చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. మన పెద్దల ప్రకారం.. రాత్రిపూట కుక్కలు మెురగడం అశుభం, అది ప్రతికూల శక్తులకు సంకేతం అంటారు. దెయ్యాలు, భూతాల వంటి కనిపించని శక్తులను కుక్కలు చూడగలవా అనే విషయంలో చాలా మంది గందరగోళానికి గురవుతారు. దీని గురించి చూద్దాం..

మనుషుల కంటే కుక్కలకు వాసన పసిగట్టే, గ్రహించే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రజలు ఈ శాస్త్రీయ వాస్తవాన్ని తమ నమ్మకాలతో ముడిపెట్టుకుంటారు. కుక్కలు తమ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను త్వరగా గుర్తిస్తాయని అంటారు. రాత్రిపూట కుక్కలు వింతగా మొరిగితే అవి ఆత్మలను, భూతాలను లేదా యమదూతలను చూస్తున్నాయని ఇప్పటికీ బలంగా నమ్ముతారు. మన పెద్దలు కూడా అదే చెబుతారు. మానవ కంటికి కనిపించని అనేక సూక్ష్మమైన విషయాలను కుక్కలు సులభంగా చూడగలవు.

గరుడ పురాణంతో సహా అనేక మత గ్రంథాలలో కుక్కల ప్రస్తావన ఉంది. పౌరాణిక కథల ప్రకారం, ‘శ్యామ’, ‘శబల’ అనే రెండు కుక్కలు యమలోక ప్రవేశద్వారం వద్ద కాపలా కాస్తాయి. అందువల్ల కుక్కలకు అదృశ్య శక్తులతో సంబంధం ఉందని నమ్ముతారు. ఏదైనా ఇంటి ముందు లేదా సమీపంలో ఒక కుక్క నిరంతరం మొరిగితే, అది సమీపంలో ఎవరైనా మరణించబోతున్నారనడానికి సంకేతంగా భావిస్తారు. అర్ధరాత్రి కుక్కలు మెురిగితే.. ఆత్మలు తిరుగుతున్నాయని, యమదూతలు వచ్చారని పెద్దలు చెబుతుంటారు. దీనికి శాస్త్రీయ ఆధారం లేనప్పటికీ ఇది ప్రజల మనస్సులలో గాఢంగా పాతుకుపోయిన నమ్మకం.

మీరు ఏదైనా ముఖ్యమైన పనిని లేదా ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నప్పుడు, ఒక కుక్క ప్రశాంతంగా కూర్చుని ఉండటం చూస్తే.. అది ఒక మంచి శకునం. దీనివల్ల మీరు చేపట్టిన పని విజయవంతమవుతుంది. ప్రయాణంలో కుక్కలు పోట్లాడుకోవడం లేదా కలహించుకోవడం చూస్తే, మీరు చేపట్టిన పని అసంపూర్తిగా మిగిలిపోతుందని నమ్ముతారు.

కుక్క లు ఒకదానితో ఒకటి ఆడుకుంటుంటే.. అది రాబోయే శ్రేయస్సు, సంతోషానికి సంకేతంగా భావిస్తారు. ఒక కుక్క మీ దగ్గరకు వచ్చి మీ పాదాలను నాకడం ప్రారంభిస్తే, మీకు త్వరలో సుదీర్ఘ ప్రయాణం రాబోతోందని అర్థం. ఒక కుక్క పదేపదే ఒకే చోట తవ్వితే, ఆ ప్రదేశంలో నిధి దాచిపెట్టి ఉండవచ్చని నమ్ముతారు.

కుక్కల అరుపులు, వాటి ప్రవర్తన కేవలం సహజమైన జంతు లక్షణాలు కావచ్చు. అయితే మతపరమైన, సాంప్రదాయ దృక్కోణం నుండి చూస్తే.. వాటికి వాటి స్వంత అశుభ, శుభ చిహ్నాలు ఉన్నాయి.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.