
పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై ప్రేక్షకులను అలరించిన మోహన్ లాల్ నటించిన ‘తుడరుమ్’ సినిమా 230 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఈ బ్లాక్ బస్టర్ చిత్రం ఓటీటీలో ఎప్పుడు విడుదల అవుతుందో తెలుసుకుందాం.
Key Points
230 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో తుడరుమ్ బ్లాక్ బస్టర్ హిట్!
కేరళ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించింది.
మే 30 నుండి జియో హాట్‌స్టార్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ ప్రారంభం.
మోహన్ లాల్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించింది.
తుడరుమ్: బాక్సాఫీస్ దగ్గర రికార్డులు
పెద్దగా అంచనాల్లేకుండా థియేటర్లకు వచ్చి ప్రపంచ స్థాయిలో అదరగొట్టడమే కాకుండా కేరళ బక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్లు రాబట్టిన సినిమా తుడరుమ్. మోహన్‌లాల్ అద్భుత యాక్టింగ్ తో అదరగొట్టిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంది. ఈ థ్రిల్లర్ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎదురు చూసిన ఫ్యాన్స్ కు ఇప్పుడు గుడ్ న్యూస్ వచ్చింది.
మోహన్‌లాల్ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ తుడరుమ్ ’ ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజైంది. పెద్దగా హైప్ లేకుండా రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మ రథం పట్టారు. దీంతో కలెక్షన్లు కుమ్మేసింది. ఇప్పుడు థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాత ఈ మూవీ ఓటీటీ లోకి రాబోతోంది. మే 30 నుంచి ఈ మూవీ డిజిటిల్ స్ట్రీమింగ్ కానుంది.
ఓటీటీ రిలీజ్ వివరాలు
బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల రికార్డు నెలకొల్పిన తుడరుమ్ సినిమా ఓటీటీ రైట్స్ ను జియోహాట్‌స్టార్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ మూవీ మే 30 నుంచి జియోహాట్‌స్టార్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది. తుడరుమ్ మూవీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన మూవీ లవర్స్.. మరో మూడు రోజుల తర్వాత సినిమాను ఓటీటీలో చూడొచ్చు.
మోహన్‌లాల్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ తుడరుమ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్లు రాబట్టింది. కేరళ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్లు దక్కించుకున్న మలయాళ సినిమాగా తుడరుమ్ నిలిచింది. అలాగే కేరళలో రూ.100 కోట్లు కొల్లగొట్టిన ఫస్ట్ మలయాళం మూవీ కూడా ఇదే. అలాగే కేరళలో 50 కోట్ల షేర్ సాధించిన తొలి మూవీ కూడా ఇదే కావడం విశేషం.
మోహన్ లాల్ నటన ప్రశంసలు
ఇక ప్రపంచవ్యాప్తంగా 30 రోజుల్లో ఈ సినిమా రూ.230.45 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. కేరళలోనే రూ.115.25 కోట్లు సొంతం చేసుకుంది. ఇండియాలో 30 రోజుల్లో సుమారు రూ.120 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది తుడరుమ్.
ఎల్2 ఎంపురాన్ తర్వాత తుడరుమ్ తో మోహన్ లాల్ వరుసగా రెండో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నారు. పోయిన తన ట్యాక్సీని వెతుక్కుంటూ షణ్ముగం ‘బెంజ్’ ఎంతవరకు వెళతాడు అనేది సినిమా కథాంశం. దాదాపు పదిహేనేళ్ల విరామం తర్వాత మోహన్ లాల్ తో కలిసి నటి శోభన తెరపై కలిసి నటించడం విశేషం. ఎల్2 ఎంపురాన్ లో పవర్ ఫుల్ రోల్ ప్లే చేసిన మోహన్ లాల్.. తుడరుమ్ లో ఫ్యామిలీ మ్యాన్ గా, ట్యాక్సీ కోసం వెతికే పర్సన్ గా యాక్టింగ్ తో సత్తాచాటారు.
అద్భుతమైన కలెక్షన్లతో అలరించిన తుడరుమ్ చిత్రం ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మే 30 నుంచి జియో హాట్‌స్టార్ లో ఈ సినిమా చూడొచ్చు.


