|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మోహన్ బాబుకు హైకోర్టు షాక్! కిడ్నాప్ కేసులో అరెస్ట్ తప్పదా? సంచలన తీర్పు!

Published: 18-02-2026, 12:05 AM
  • స్టూడెంట్ యూనియన్ లీడర్స్ కిడ్నాప్ కేసులో మోహన్ బాబుకు ఎదురుదెబ్బ.
  • అరెస్ట్ కాకుండా రక్షణ కోరుతూ మోహన్ బాబు వేసిన పిటిషన్ను తోసిపుచ్చిన కోర్టు.
  • విచారణ సందర్భంగా కోర్టుకు కీలక సమాచారం అందించిన పోలీసులు.
  • మార్చి 3 వరకు కేసును వాయిదా వేసిన న్యాయస్థానం.

టాలీవుడ్ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. స్టూడెంట్ యూనియన్ లీడర్స్ కిడ్నాప్ కేసులో ఆయనను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మోహన్ బాబు పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

Mohan Babu : టాలీవుడ్ సీనియర్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కదురు.. స్టూడెంట్ యూనియన్ లీడర్స్ కిడ్నాప్ కేసులో తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని మోహన్ బాబు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ పై జరిపిన న్యాయస్థానం ఆయనకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చింది. అతని పిటిషన్ తోసి పుచ్చింది. మోహన్ బాబు కిడ్నాప్ కేసుకు సంబంధించిన పిటిషన్ కూడా కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సందర్భంగా పోలీసులు కోర్టుకు కీలక సమాచారాన్ని అందించారు. కిడ్నాప్ కేసు పై తదుపరి విచారణ జరగనుందని తెలుస్తుంది. మరి మోహన్ బాబుని పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదా అన్నది మరికాసేపట్లో తెలిసే అవకాశం ఉంది.. ఈ కేసు గురించి కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

ఏపీ స్టూడెంట్ యూనియన్ లీడర్స్ కిడ్నాప్ అయ్యారని కొన్ని రోజుల క్రితం కేసు నమోదు అయ్యింది. సినీ నటుడు, మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) ఛాన్సలర్ మోహన్ బాబు, అలాగే ఆయన కొడుకు మంచు విష్ణు పై కేసులు నమోదు అయ్యాయి.. అయితే ఈ కేసులో అరెస్టుపై మోహన్ బాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం అతనికి షాక్ ఇచ్చింది. ఈ వివాదానికి సంబంధించిన అనుబంధ పిటిషన్ను సైతం కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.. యూనివర్సిటీ పీఆర్వో సతీష్ తో ఆయన నిత్యం ఫోన్లో మాట్లాడరని, వారి మధ్య మెసేజ్లు కూడా మారాయని పోలీసులు ఆధారాలను చూపిస్తున్నారని కోర్టు తెలిపింది. ఈ కేసు ఫిటిషన్ పై జస్టిస్ వెంకట జ్యోతిర్మయి విచారణ జరిపారు. ఈ కేసులో ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని మార్చి 3కి వాయిదా వేశారు.. మరి అప్పటివరకు మోహన్ బాబుని పోలీసులు అదుపులోకి తీసుకుంటారా? లేదా మరో వాయిదా వచ్చేంతవరకు ఆయనని అలానే వదిలేస్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ అతనికి వ్యతిరేకంగా తీర్పు గనుక వస్తే మోహన్ బాబుని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..

కిడ్నాప్ కేసులో కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు

మోహన్ బాబు అరెస్ట్ అవుతారా?

హైకోర్టు తీర్పు మోహన్ బాబుకు ప్రతికూలంగా ఉండటంతో, ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా అనే చర్చ జరుగుతోంది. ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. మార్చి 3న దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.