|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘సుయోధన’ హీరోయిన్ దృషికా చందర్: షాకింగ్ బ్యాక్‌గ్రౌండ్ నిజాలు! తల్లి ఎవరు, ఏం చేసేవారో తెలుసా?

Published: 27-03-2026, 1:35 AM
‘సుయోధన’ హీరోయిన్ దృషికా చందర్: షాకింగ్ బ్యాక్‌గ్రౌండ్ నిజాలు! తల్లి ఎవరు, ఏం చేసేవారో తెలుసా?
  • సుయోధన మూవీలో హీరోయిన్‌గా దృషికా చందర్
  • దృషికా తల్లి అరుంధతి సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్
  • న్యూయార్క్ ఫ్యాషన్ స్కూల్‌లో దృషికా డిగ్రీ పూర్తి
  • కిక్ బాక్సింగ్, డైవింగ్‌లో శిక్షణ పొందిన దృషికా

టాలీవుడ్‌లో ‘సుయోధన’ మూవీతో హీరోయిన్‌గా పరిచయమైన దృషికా చందర్ బ్యాక్‌గ్రౌండ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆమె తల్లి సినీ పరిశ్రమలో ఉండటంతో దృషికాకు చిన్నప్పటినుంచే సినిమాలపై ఆసక్తి ఏర్పడింది.

దృషికా చందర్ సినీ నేపథ్యం

Drishika Chander : టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. స్టార్ హీరోల సినిమాలతో పోలిస్తే చిన్న హీరోల సినిమాలతో కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు.. మొదటి సినిమాతోనే మంచి క్రియేషన్ సంపాదించుకున్న ఆ ముద్దుగుమ్మలు అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకొని స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా చేస్తున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న సినిమాగా ఇవాళ రిలీజ్ అయిన మూవీ సుయోధన.. ఈ మూవీలో హీరోయిన్గా నటించిన దృషికా గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసుకునేందుకు నేటిజల్లు గూగుల్ లో తెగ వెతికిస్తున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ బ్యాగ్రౌండ్ ఏంటి? ఆమె పేరెంట్స్ ఏం చేస్తారో అన్న విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

ప్రియదర్శి, సాయికుమార్, విష్ణు ఓఐ, దేవీ ప్రసాద్, దృషికా చందర్, రాజశ్రీ నాయర్ వంటి స్టార్స్ నటించిన మూవీ సుయోధన.. వైఎస్ మాధవ్ రెడ్డి దర్వకత్వం వహించారు. ప్రజ్వల లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై బోసుబాబు నిడిమోలు నిర్మాతగా వ్యవహారించారు. ఇక శ్రీరామానవమి సందర్బంగా ఈ చిత్రం మార్చి 27వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజ్ అయినయి మూవీ ప్రస్తుతం పాజిటివ్ టాక్ ని అందుకున్నట్లు తెలుస్తుంది.. ఈ మూవీలో హీరోయిన్గా నటించిన దృషికా గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వినిపిస్తుంది.. ఈమె బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకోవాలని నెటిజెన్లు గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. ఈమె తల్లి అరుంధతి మూవీకి క్యాస్టూమ్ డిజైనర్‌గా పనిచేశారు. ఆమె ప్రొడక్షన్ డిజైనర్‌గా, ఆర్ట్ విభాగంలో, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన విశేష అనుభవం ఉంది.. తల్లి ఇండస్ట్రీలో ఉండడంతో ఆమె కూడా చిన్నప్పటినుంచి సినిమాలో నటించాలని ఒక కోరిక ఉన్నట్లు ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.. అలా తను ఇండస్ట్రీ లోకి రావాలని ఫిక్స్ అయినట్లు బయట పెట్టింది.

సుయోధన మూవీతో ఎంట్రీ

దృషికా తల్లి ఏం చేసేవారో తెలుసా?

ఈ అమ్మడు చదువు పూర్తి చేసుకొని న్యూయార్క్ ఫ్యాషన్ స్కూల్‌లో డిగ్రీ పూర్తి చేసింది. కిక్ బాక్సింగ్ నేర్చుకొన్నాను. డైవింగ్‌లో శిక్షణ పొందాను అని ఆమె అంటున్నారు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా థియేటర్లలో నాటకాలు వేయడం మొదలుపెట్టాను అని ఆమె అన్నారు. మా అమ్మ ప్రోత్సాహంతోనే అంతవరకే వచ్చాను అని ఆ ముద్దుగుమ్మ అంటుంది. నాటకాల్లో నటించినప్పుడు నా పెర్ఫార్మెన్స్ చూసి సుయోధన కథ చెప్పారు.. అలా నాకు ఈ సినిమాలో అవకాశం వచ్చింది అని దృషికా అంటున్నారు. ఈ సినిమాలో సమిత అనే పాత్రలో నటించింది. సైకలాజికల్ జోనర్‌తో కథ ఉంటుంది.. ఈమధ్య ఇలాంటి స్టోరీ తో వచ్చే సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. మరి ఈ మూవీ ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో తెలియాలంటే కాస్త వెయిట్ చెయ్యాల్సిందే..

చిన్న సినిమాగా విడుదలైన ‘సుయోధన’లో దృషికా నటనకు మంచి స్పందన వస్తోంది. ఆమె బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. త్వరలోనే మరిన్ని అవకాశాలు అందుకుంటుందేమో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.