
📌 Key Points
- బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘జయ జానకి నాయక’ చిత్రం యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది.
- 2017లో విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ఆశించిన విజయం సాధించలేదు.
- ‘ఖూన్ ఖార్’ పేరుతో హిందీ డబ్బింగ్ వెర్షన్ 100 కోట్ల వ్యూస్ దాటింది.
- యూట్యూబ్‌లో 1 బిలియన్ వ్యూస్ సాధించిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది.
థియేటర్లలో ఆశించిన విజయం సాధించకపోయినా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యూట్యూబ్‌లో చరిత్ర సృష్టించారు. ఆయన నటించిన ‘జయ జానకి నాయక’ చిత్రం హిందీ డబ్బింగ్ వెర్షన్ ‘ఖూన్ ఖార్’ 100 కోట్ల వ్యూస్‌తో రికార్డు సృష్టించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది.
థియేటర్లలో ఫ్లాప్.. యూట్యూబ్‌లో బ్లాక్‌బస్టర్!
Bellamkonda Srinivas:ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ (Bellamkonda Suresh) వారసుడిగా ‘అల్లుడు శీను’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas). ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ ని మాత్రం అందుకోవడం లేదు. అలాంటి ఈయన ఇప్పుడు యూట్యూబ్లో చరిత్ర సృష్టించారు. గతంలో ఆయన నటించిన ఒక చిత్రం థియేటర్లలో ఫ్లాప్ గా నిలిచింది. కానీ ఇప్పుడు అదే సినిమా యూట్యూబ్లో సంచలనంగా నిలవడమే.. ఇండియాలో తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది. మరి ఏంటా చిత్రం? అది సృష్టించిన రికార్డు ఏంటి? అనే విషయం ఇప్పుడు చూద్దాం..
ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ డ్రామా చిత్రం ‘జయ జానకి నాయక’. 2017లో విడుదలైన ఈ సినిమా అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. కానీ డిజిటల్ ప్రపంచంలో మాత్రం ఊహించని రీతిలో సంచలనం సృష్టించింది. ‘ఖూన్ ఖార్’ పేరుతో ఇదే చిత్రాన్ని హిందీలో డబ్ చేసి థియేటర్లలో కాకుండా నేరుగా యూట్యూబ్లో విడుదల చేశారు. కేవలం డబ్బింగ్ వెర్షన్ తో యూట్యూబ్లో విడుదలైన ఈ చిత్రాన్ని అటు థియేటర్లలో తెలుగు ఆడియన్స్ ఆదరించక పోయినా.. యూట్యూబ్లో నార్త్ ఆడియన్స్ విపరీతంగా ఆదరించారు.
100 కోట్ల వ్యూస్‌తో చరిత్ర సృష్టించిన తొలి భారతీయ చిత్రం
బోయపాటి మార్క్ మాస్ యాక్షన్ , కమర్షియల్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ హిందీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా వ్యూస్ క్రమంగా పెరుగుతూ.. ఏకంగా వన్ బిలియన్ (100 కోట్లు) వ్యూస్ దాటింది. ఇక ఈ వ్యూస్ ని బట్టి చూస్తే ఇప్పటివరకు యూట్యూబ్ లో ఈ రేంజ్ లో వ్యూస్ రాబట్టిన తొలి ఇండియన్ మూవీగా ఈ సినిమా రికార్డులు సృష్టించింది. అంతేకాదు మరోసారి హిందీ మార్కెట్లో డబ్ చేసిన దక్షిణాది సినిమాల ప్రభావాన్ని ఈ రికార్డు చాటి చెప్పింది..
వాస్తవానికి థియేటర్లలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సత్తా చాటలేకపోయినా.. డిజిటల్ వేదికలపై ఎప్పటికప్పుడు తన ఫ్యాన్ బేస్ ను నిరూపించుకుంటున్నారు.ఉత్తరాదిలో ఈయనకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడగా ఆ ప్రయాణంలో ఈ చిత్రం అతిపెద్ద విజయాలలో ఒకటిగా నిలిచి అటు డిజిటల్ వేదికగా ఇటు ఉత్తరాదిలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫ్యాన్ క్రేజ్ కు అద్దం పడుతోంది.. ఇకపోతే ఈ సినిమా విడుదలయై ఇప్పటికి దాదాపు 8 ఏళ్లకు పైగానే అవుతున్నా.. ఇంకా యూట్యూబ్లో ఈ సమయంలో అలాంటి రికార్డులు క్రియేట్ చేయడం ఒక ఈ చిత్రానికే దక్కింది.
ఉత్తరాదిలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క్రేజ్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ విషయానికి వస్తే.. ఇటీవలే తన ప్రేయసి కావ్య రెడ్డితో ఏడడుగులు వేశారు. ప్రస్తుతం ఆయన సినిమా కెరియర్ విషయానికి వస్తే.. సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా భైరవం చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. కిష్కింధపురి సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక సంయుక్త మీనన్ తో కలిసి హైందవ సినిమాతో పాటు సాగర కే చంద్ర దర్శకత్వంలో టైసన్ నాయుడు అనే చిత్రంలో నటిస్తున్నారు.
ఈ రికార్డు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు ఉత్తరాదిలో ఉన్న ఫ్యాన్ బేస్‌ను చాటి చెప్పింది. థియేటర్లలో కాకపోయినా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఆయన సత్తా ఏంటో మరోసారి రుజువైంది.


