|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

OG విధ్వంసం షురూ! థమన్ మ్యూజిక్‌తో పవన్ కల్యాణ్ విశ్వరూపం.. ఫ్యాన్స్‌కు పూనకాలే!

Published: 28-06-2026, 1:39 AM
OG విధ్వంసం షురూ! థమన్ మ్యూజిక్‌తో పవన్ కల్యాణ్ విశ్వరూపం.. ఫ్యాన్స్‌కు పూనకాలే!
  • ‘ఓజీ 2’ స్టోరీ సిట్టింగ్స్ పూర్తవగా, “ది ఆరిజిన్ ఆఫ్ ఫైర్” సౌండ్‌ట్రాక్ విడుదలైంది.
  • పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఛానెల్ ద్వారా విడుదలైన ఈ ట్రాక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్.
  • ఎస్.ఎస్. థమన్ కంపోజ్ చేసిన ఈ మ్యూజిక్ పవన్ కల్యాణ్ ఎలివేషన్స్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది.
  • ఈ సౌండ్‌ట్రాక్ ‘ఓజీ 2’పై అభిమానుల అంచనాలను భారీగా పెంచింది.

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు పండగే! బ్లాక్‌బస్టర్ ‘ఓజీ’ చిత్రానికి సీక్వెల్‌గా రానున్న ‘ఓజీ 2’ నుండి “ది ఆరిజిన్ ఆఫ్ ఫైర్” సౌండ్‌ట్రాక్ విడుదలైంది. థమన్ సంగీతం అందించిన ఈ పవర్‌ఫుల్ ట్రాక్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

“ది ఆరిజిన్ ఆఫ్ ఫైర్”: ఓజీ యూనివర్స్ విస్తరణ

OG 2:పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు పూనకాలు తెప్పించే క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. సుజీత్ డైరెక్షన్‌లో గతేడాది రిలీజై బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ‘ఓజీ’చిత్రానికి సీక్వెల్‌గా ‘ఓజీ 2’ స్టోరీ సిట్టింగ్స్ పూర్తయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఓజీ యూనివర్స్ నుంచి “ది ఆరిజిన్ ఆఫ్ ఫైర్” అనే పవర్‌ఫుల్ ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ నెట్టింట విడుదలై హల్‌చల్ చేస్తోంది. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అఫీషియల్ ఛానల్ ద్వారా వచ్చిన ఈ మ్యూజిక్ సర్‌ప్రైజ్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’. పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఇక థియేటర్లలో పవన్ కల్యాణ్ మార్క్ స్వాగ్, సుజీత్ టేకింగ్‌కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఇప్పుడు అదే జోష్‌లో ‘ఓజీ 2’ కోసం మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

“ఎవ్రీ ఫైర్ హాస్ యాన్ ఆరిజిన్.. దిస్ వన్ చేంజ్డ్ ఎవ్రీథింగ్” అనే పవర్‌ఫుల్ క్యాప్షన్ ఓజీ సినిమాకు ఒక బ్రాండ్‌గా మారిపోయింది. ‘ఓజీ 2’ అనౌన్స్‌మెంట్ వీడియో వచ్చినప్పటి నుంచి అందులోని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక అభిమానుల కోరిక మేరకు మేకర్స్ ఈ ఒరిజినల్ సౌండ్‌ట్రాక్‌ను స్పెషల్‌గా రిలీజ్ చేసి ఓజీ యూనివర్స్‌ను మరింత ఎక్స్‌పాండ్ చేశారు.

టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా విడుదలైన ‘ది ఆరిజన్ ఆఫ్ ఫైర్’ ట్రాక్ పవన్ కల్యాణ్ రేంజ్ ఎలివేషన్లకు పక్కాగా సరిపోయేలా ఉంది. హెవీ బేస్, థంపింగ్ డ్రమ్స్, గూస్‌బంప్స్ తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో థమన్ మరోసారి తన మార్క్ చూపించారు. ఈ సౌండ్‌ట్రాక్ వింటుంటేనే థియేటర్లలో ‘ఓజీ 2’ విధ్వంసం ఏ రేంజ్‌లో ఉండబోతోందో అర్థమవుతోంది.

థమన్ మ్యూజిక్ మ్యాజిక్.. ఫ్యాన్స్‌కు పూనకాలే!

ఈ ట్రాక్ బయటకు వచ్చిన నిమిషాల్లోనే యూట్యూబ్‌తో పాటు ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లలో టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఇక పవన్ కల్యాణ్ పవర్-ప్యాక్డ్ స్క్రీన్ ప్రెజెన్స్‌ను ఎలివేట్ చేసేలా ఉన్న ఈ థీమ్ మ్యూజిక్‌ను ఫ్యాన్స్ లూప్‌లో పెట్టి వింటున్నారు. సీక్వెల్ మూవీపై అంచనాలను ఈ ఒక్క సౌండ్‌ట్రాక్ ఎక్కడికో తీసుకెళ్లిపోయింది.

ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ మ్యాజిక్ ఇంకా తగ్గలేదని ఈ లేటెస్ట్ అప్‌డేట్‌తో మరోసారి ప్రూవ్ అయింది. సుజీత్ స్క్రీన్ ప్లేకి, థమన్ అదిరిపోయే మ్యూజిక్ తోడైతే థియేటర్లలో ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు. మరి ఈ ‘ఓజీ 2’ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సరికొత్త రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.

‘ఓజీ 2’పై అంచనాలు పెంచిన సౌండ్‌ట్రాక్

Every Fire Has an Origin. This One Changed Everything.

The Origin of Fire 🔥 @PawanKalyan @Sujeethsign @MusicThaman #TheOriginOfFire #OGUniverse #OGUniverseOST pic.twitter.com/JxUB7gcqpy

— Pawan Kalyan Creative Works (@PKCWoffl) June 27, 2026

“ది ఆరిజిన్ ఆఫ్ ఫైర్” సౌండ్‌ట్రాక్ ‘ఓజీ 2’పై అంచనాలను ఆకాశానికి చేర్చింది. పవన్ కల్యాణ్ మార్క్ స్వాగ్, థమన్ మ్యూజిక్ కాంబినేషన్ థియేటర్లలో విధ్వంసం సృష్టించడం ఖాయం. ఈ యూనివర్స్ విస్తరణ అభిమానులకు నిజమైన ట్రీట్.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.