|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అనిరుధ్-కావ్య మ్యారేజ్ ఫిక్స్! అఖండ 2 నటుడి షాకింగ్ కామెంట్స్! వైరల్ అవుతున్న లవ్ స్టోరీ!

Published: 28-06-2026, 1:39 AM
అనిరుధ్-కావ్య మ్యారేజ్ ఫిక్స్! అఖండ 2 నటుడి షాకింగ్ కామెంట్స్! వైరల్ అవుతున్న లవ్ స్టోరీ!
  • అనిరుధ్-కావ్య మ్యారేజ్ రూమర్స్ నిజమేనన్న వై.జి. మహేంద్రన్.
  • ‘అఖండ 2’ నటుడి వ్యాఖ్యలతో కోలీవుడ్, టాలీవుడ్‌లో ప్రకంపనలు.
  • కావ్య మారన్ బిజినెస్ జీనియస్ అంటూ మహేంద్రన్ ప్రశంసలు కురిపించారు.
  • త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న అనిరుధ్, కావ్యా మారన్ జోడి.

కోలీవుడ్ సంచలన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్ పెళ్లిపై తాజాగా ఓ బిగ్ అప్డేట్ సంచలనం సృష్టిస్తోంది! ‘అఖండ 2’ నటుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

వై.జి. మహేంద్రన్ సంచలన వ్యాఖ్యలు!

కోలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ , సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీ అధినేత కావ్యా మారన్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియా కోడై కూస్తోన్న సంగతి తెలిసిందే. తమిళ సీనియర్ నటుడు వై.జి. మహేంద్రన్ ఈ పెళ్లి పుకార్లపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. అనిరుధ్‌తో ఉన్న సాన్నిహిత్యం, కావ్య మారన్ వ్యాపార నైపుణ్యాల గురించి ఆయన షేర్ చేసుకున్న విశేషాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. * నాగ్ అశ్విన్ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన మహానటి.. ‘కల్కి’లో బుజ్జి క్యారెక్టర్ వెనుక ఇంత కథ ఉందా? తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిరుధ్ వివాహం గురించి వై.జి. మహేంద్రన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అనిరుధ్ చాలా సాఫ్ట్ బాయ్ అని, ఎంతో సమర్థుడని కొనియాడారు. అయితే ఏదో ఒక విషయం అతన్ని పెళ్లి వైపు అడుగులు వేయకుండా ఆపుతోందని, కానీ త్వరలోనే ఆ అడ్డంకులు తొలగిపోతాయని ఆశిస్తున్నట్లు నవ్వుతూ పేర్కొన్నారు. అనిరుధ్ త్వరలోనేపెళ్లి చేసుకోబోతున్నాడని, ఈ విషయంలో అతనికి తన శుభాకాంక్షలు ఉంటాయని వై.జి. మహేంద్రన్ వెల్లడించారు. తాను కూడా విన్నదాన్ని బట్టే చెప్తున్నప్పటికీ, ఈ వివాహం ఖచ్చితంగా జరుగుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. వీరిద్దరి జోడి చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుందని, మంచి జంటగా పేరు తెచ్చుకుంటారని ప్రశంసించారు. కావ్యా మారన్ కేవలం సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్‌గా మాత్రమే కాకుండా, వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారని వై.జి. మహేంద్రన్ ప్రశంసించారు. కళానిధి మారన్ బిజినెస్ జీన్స్‌ను పూర్తిగా పుణికిపుచ్చుకోవడం వల్లే కావ్య మారన్ అంత పెద్ద ఐపీఎల్ టీమ్‌ను విజయవంతంగా హ్యాండిల్ చేస్తున్నారని కొనియాడారు. గతంలో కావ్యా మారన్ ‘సన్ టీవీ’ ఓటీటీ విభాగానికి హెడ్‌గా ఉన్న సమయంలో ఆమెతో జరిగిన ఒక అనుభవాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఒక ప్రాజెక్ట్ సబ్మిషన్ కోసం వెళ్ళినప్పుడు ఆమె చాలా మర్యాదగా మాట్లాడారని, కథలు నచ్చి ఒకేసారి ఆరు ప్రాజెక్టులను సెలెక్ట్ చేసుకున్నారని గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ ఓటీటీ ప్రాజెక్టులను వారు కొంతకాలం నిలిపివేసినప్పటికీ, ఒక వ్యక్తిగా కావ్యా మారన్ చాలా మంచి మనసున్న వ్యక్తని కొనియాడారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్, బిజినెస్ మైండ్‌తో దూసుకుపోతున్న కావ్య మారన్ .. ఇకపై వీరిద్దరూ కలిసి ‘మ్యూజికల్ బిజినెస్’ (సంగీత వ్యాపారం) చేస్తారంటూ వై.జి. మహేంద్రన్ నవ్వుతూ చమత్కరించారు. వైజీ మహేంద్రన్ కామెంట్స్‌తో అనిరుధ్ – కావ్య పెళ్లి మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. * రిలీజ్‌కి ముందే ‘నాగబంధం’ సంచలనం.. హాట్ కేకుల్లా అమ్ముడైన థియేట్రికల్ రైట్స్ నాటకరంగ దిగ్గజం వై.జి. మహేంద్రన్ తమిళ చిత్రపరిశ్రమలో వై.జి. మహేంద్రన్‌కు దశాబ్దాల చరిత్ర ఉంది. ఆయన కేవలం నటుడే కాకుండా రంగస్థల దర్శకుడిగా, నాటక రచయితగా ‘యునైటెడ్ అమేచ్యూర్ ఆర్టిస్ట్స్’ ద్వారా ఎన్నో అద్భుత ప్రదర్శనలు ఇచ్చారు. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్లతో ఎన్నో చిత్రాల్లో నటించిన ఈ సీనియర్ నటుడు.. గతేడాది ‘అఖండ 2’ ద్వారా తెలుగు ప్రేక్షకుల్ని సైతం అలరించారు.

కావ్యా మారన్ వ్యాపార సామర్థ్యంపై ప్రశంసలు!

అనిరుధ్-కావ్య: మ్యూజికల్ బిజినెస్ జోడీ!

అనిరుధ్, కావ్యా మారన్ పెళ్లి నిజంగా జరుగుతుందా లేదా అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాలి. ఈ మెగా పెళ్లి గురించి మరింత సమాచారం కోసం మా పేజీని చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.