|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగాస్టార్ లేడీ గెటప్! మీసం తీయడంతో సురేఖ ఇచ్చిన షాకింగ్ వార్నింగ్ ఇదే! వైరల్ అవుతున్న చిరు సీక్రెట్!

Published: 28-06-2026, 1:40 AM
మెగాస్టార్ లేడీ గెటప్! మీసం తీయడంతో సురేఖ ఇచ్చిన షాకింగ్ వార్నింగ్ ఇదే! వైరల్ అవుతున్న చిరు సీక్రెట్!
  • ‘చంటబ్బాయ్’లో చిరంజీవి లేడీ గెటప్ కోసం మీసం తీశారు.
  • మీసం లేని చిరుని చూసి సురేఖ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
  • మీసాలు తీయడానికి 70 మంది సిబ్బందికి షరతు పెట్టారు.
  • అంజనమ్మ కూడా చిరు గెటప్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు.

మెగాస్టార్ చిరంజీవి అంటేనే సంచలనం! ఆయన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు. అయితే, ఒకప్పుడు ఆయన లేడీ గెటప్‌లో కనిపించినప్పుడు ఇంట్లో ఎదురైన అనుభవం గురించి ఇప్పుడు వైరల్‌గా మారింది. సురేఖ ఇచ్చిన షాకింగ్ వార్నింగ్ ఏంటో తెలుసా?

మెగాస్టార్ లేడీ గెటప్ వెనుక అసలు కథ!

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో సొంతంగా ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి.. 45 ఏళ్ల ఫిల్మ్ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు. ఎంతో కష్టపడి మెగాస్టార్ రేంజ్ కు ఎదిగారు. ఆయన కెరీర్ లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చాలా చేశారు. ఒక్కోసారి స్టార్ ఇమేజ్ ను పక్కన పెట్టి.. చిరంజీవి లేడీ క్యారెక్టర్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరు ఏదో ఒక సందర్భంలో లేడీ పాత్రలు చేసిన వారే. అయితే చిరంజీవి పెళ్లైన తరువాత ఓ సినిమాలో మీసం తీసేసి, ఫారెన్ గౌను వేసుకుని.. సాంగ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు ఆయన పడిన తిప్పలు అన్నీ ఇన్నీ కావు.

చిరంజీవి రెండు సినిమాల్లో పలు సందర్భాల్లో లేడీ గెటప్ లో కనిపించారు. జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయ్ మూవీలో మెగాస్టార్ ఓ డిటెక్టీవ్ పాత్రలో కనిపించారు. డిటెక్టివ్ పాత్రలో నటిస్తూ విభిన్న గెటప్స్ వేశారు. ఇందులో భాగంగానే ఒక సీన్, సాంగ్ లో గౌను, తలపై టోపీ ధరించి లేడీ గెటప్‌లో కనిపించి ప్రేక్షకులను ఎంతగానో నవ్వించారు. అంతే కాదు అంతకు ముందు పట్నం వచ్చిన పతివ్రతలు సినిమాలో కూడా మోహన్ బాబుతో కలిసి లేడీ గెటప్ వేసుకుని కనిపించాడు చిరంజీవి. అయితే చంటబ్బాయి సినిమా టైమ్ లో మాత్రం మెగాస్టార్ తన ఇంట్లో తిట్లు తినాల్సి వచ్చిందట.

సురేఖ ఇచ్చిన షాకింగ్ వార్నింగ్!

లేడీ గెటప్‌ గురించి ఓ సినిమా ఈవెంట్ లో చిరంజీవి డైరెక్ట్ కామెంట్స్ చేశారు. చంటబ్బాయిలో ఆ క్యారెక్టర్ నాకు సెట్ కాలేదని నా కుటుంబసభ్యులు అన్నారు. అలా నన్ను చూడలేకపోయారు. అమ్మ అంజనమ్మ అయితే ఏంటిరా ఇది అని తిట్టారు.. ఇక సురేఖ అయితే.. మళ్లీ మీసాలు పెంచేవరకు కంటికి కనిపించొద్దని వార్నింగ్ కూడా ఇచ్చింది అంటూ ‘చంటబ్బాయి’ సంగతులు గుర్తుచేసుకున్నారు చిరంజీవి.

లేడీ గెటప్‌ కోసం మీసాలు తీయాల్సి వచ్చినప్పుడు, చిరంజీవి దర్శకుడు జంధ్యాలకు ఓ షరతుకూడా పెట్టారట. షూటింగ్‌లో ఉన్న70 మంది స్టాఫ్ కూడా మీసాలు తీస్తేనే తాను తీస్తానన్నారు. దీనికి అందరూ అంగీకరించడంతో చిరంజీవి కూడా మీసాలు తీయక తప్పలేదు. అంతే కాదు అక్కడ ఉన్న చాలామందితో లేడీ గెటప్ లు కూడా వేయించారట. జంధ్యాల. తను ఇబ్బందిపడుతూ షూటింగ్ చేయకూడదని.. డైరెక్టర్ కాస్త డిఫరెంట్ గా ఆలోచించారట.

మీసాలు తీయడానికి చిరు పెట్టిన కండిషన్!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. 70 ఏళ్ళ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ.. రచ్చ చేస్తున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలోనే మన శంకర వరప్రసాదుగారు సినిమాతో భారీ సంక్రాంతి హిట్ కొట్టిన చిరంజీవి.. ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి బరిలో దిగాలని పట్టుదలతో ఉన్నాడు. ఇక ఈలోపు విశ్వంభర కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు ఉన్నాయి. ఆయన పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం అభిమానులకు ఎప్పుడూ ఆనందమే. ఇలాంటి మరిన్ని సంచలన అప్‌డేట్స్ కోసం వేచి చూడండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.