
లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల “మాస్ జాతర” సినిమా ప్రమోషన్స్‌లో తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. కాబోయే భర్త అందంగా ఉండకపోయినా పర్వాలేదు కానీ, అర్థం చేసుకునేవాడై ఉండాలని, తన సినీ కెరీర్‌కు మద్దతివ్వాలని చెప్పిన ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Key Points
శ్రీలీల తన కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాలను వివరించారు.
అర్థం చేసుకునేవాడు, మంచి మనసున్నవాడు, సినీ కెరీర్‌కు గౌరవం ఇచ్చేవాడు కావాలి.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
"మాస్ జాతర" తర్వాత "ఉస్తాద్ భగత్ సింగ్", "పరాశక్తి" వంటి భారీ చిత్రాలు ఉన్నాయి.
శ్రీలీల పెళ్లిపై క్లారిటీ!
Sreeleela: లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా వస్తున్న లేటెస్ట్ మూవీ “మాస్ జాతర”. మాస్ రాజా రవితేజ హీరోగా వస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్నారు. పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న(Sreeleela) ఈ సినిమా నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేయగా సినిమా విడుదల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. అయితే, తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న శ్రీలీల తనకు కాబోయే వాడు ఎలా ఉండాలి అనేదానిపై క్లారిటీ ఇచ్చింది.
Dil Raju: మిరాయ్ ఎఫెక్ట్.. కుర్ర హీరోతో దిల్ రాజు భారీ సినిమా.. ఇక ప్రభాస్, విజయ్ పక్కకే..
“మాస్ జాతర” ప్రమోషన్స్‌లో శ్రీలీల
ఈ ఇంటర్వ్యూలో యాంకర్ మీకు కాబోయే వ్యక్తికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని అడిగింది. దానికి సమాధానంగా శ్రీలీల మాట్లాడుతూ..”నాకు భర్తగా రాబోయే వ్యక్తి అందంగా లేకపోయినా పర్వాలేదు కానీ, అర్థం చేసుకునే వాడై ఉండాలి, మంచి మనసున్న వ్యక్తి కావాలి. అలాగే నా సినీ కెరీర్ పట్ల గౌరవం ఉండాలి. నన్ను చేసే ప్రతీ పనిలో ప్రేమతో ప్రోత్సహించి ముందుకు నడిపించాలి. సరదాగా ఉండాలి, నిజాయితీ ఉండే వ్యక్తిని పెళ్లి చేసుకుంటా” అంటూ చెప్పుకొచ్చింది శ్రీలీల. దీంతో ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శ్రీలీల తదుపరి సినిమాలు
ఇక శ్రీలీల సినిమాల విషయానికి వస్తే, మాస్ జాతర సినిమా తరువాత ఈ అమ్మడు తెలుగులో చేస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ హీరో గా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తమిళంలో శ్రీలీల చేస్తున్న సినిమా పరాశక్తి. దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం ఉంది.
శ్రీలీల తన వ్యక్తిగత జీవితంపై స్పష్టమైన అభిప్రాయాలతో పాటు వృత్తిపరంగా వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఆమెకు కాబోయే వ్యక్తి ఎలా ఉండాలనే క్లారిటీ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆమె భవిష్యత్ ప్రయాణానికి ఇది శుభసూచకం.


