
ఇవాళ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా, ఆయన నటించిన అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 సినిమాలను, వాటిని చూడగలిగే ఓటీటీ ప్లాట్‌ఫామ్ లను తెలుసుకుందాం.
Key Points
పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయన టాప్ 5 సినిమాలు
ఓటీటీలో చూడదగిన పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్స్
భీమ్లా నాయక్, వకీల్ సాబ్ వంటి సూపర్ హిట్ సినిమాలు
కలెక్షన్ల రికార్డులు బ్రేక్ చేసిన పవర్ స్టార్ చిత్రాలు
పవన్ కల్యాణ్ టాప్ 5 సూపర్ హిట్ సినిమాలు
పగ రగిలిన ఫైరూ.. ఇది పవన్ కల్యాణ్ అప్ కమింగ్ మూవీ ‘ఓజీ’ నుంచి రిలీజైన ఫస్ట్ సాంగ్ లోని ఓ లైన్. అవును.. అదే నిజం. పవన్ కల్యాణ్ కు సరిగ్గా సరిపోయే లైన్ ఇది. సినీ ఇండస్ట్రీలోనైనా, రాజకీయ జీవితంలోనైనా తనతో కాదు అన్నదాన్ని చేసి చూపించడమే పవన్ నైజం. ఇవాళ (సెప్టెంబర్ 2) ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా పవన్ సినీ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 సినిమాలు ఏ ఓటీటీల్లో ఉన్నాయో చూద్దాం.
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా, తనకు ఎదురొస్తే ఎంతకైనా తెగించే వ్యక్తిగా పవన్ కల్యాణ్ అదరగొట్టిన మూవీ ‘భీమ్లా నాయక్’. ఇందులో పవన్ కల్యాణ్ వర్సెస్ రానా పోరు ఫ్యాన్స్ తో విజిల్స్ కొట్టించింది. 2022లో వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.158 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా రెండు ఓటీటీ ల్లో ఉంది. ఆహాతో పాటు జియోహాట్‌స్టార్ లో చూడొచ్చు.
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో అందుబాటులో ఉన్న చిత్రాలు
అమ్మాయిల ఆత్మగౌరవాన్ని కాపాడే మొండి ధైర్యం ఉన్న లాయర్ గా పవన్ కల్యాణ్ నటించిన మూవీ ‘వకీల్ సాబ్’. ఈ సూపర్ హిట్ సినిమా 2021లో రిలీజైంది. ప్రపంచవ్యాప్తంగా రూ.137.8 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సొంతం చేసుకుంది. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఉంది.
తాత కలను నిజం చేయడం కోసం ఇంటి నుంచి వెళ్లిపోయిన అత్తను తిరిగి తీసుకురావడానికి వెళ్లిన అల్లుడి కథే ‘అత్తారింటికి దారేదీ’. 2013లో వచ్చిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రికార్డులు తిరగరాసింది. రూ.55 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.134 కోట్ల కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది. ఈ బ్లాక్ బస్టర్ మూవీని జియోహాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్ , ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.
కలెక్షన్ల రికార్డులను బద్దలు కొట్టిన మూవీస్
రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన సినిమా ‘హరి హర వీరమల్లు’. కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే యోధుడిగా పవన్ నటించారు. కానీ భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. రూ.250 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా రూ.115.2 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ హిస్టారికల్ పీరియాడిక్ డ్రామా ప్రైమ్ వీడియోలో ఉంది.
మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి పవన్ కల్యాణ్ చేసిన మల్టీ స్టారర్ ‘బ్రో’. టైమ్ ఎంత విలువైందో చెబుతూ సాగే ఈ ఫ్యాంటసీ మూవీలో పవన్ దేవుడిగా కనిపిస్తారు. ఈ సూపర్ హిట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.110.8 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
పవన్ కల్యాణ్ సినిమా కెరీర్ లోని అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 సినిమాల గురించి ఈ కథనంలో తెలుసుకున్నాం. ఈ సినిమాలను వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో మీరు ఆస్వాదించవచ్చు.


