
తాజాగా సీనియర్ నటుడు మోహన్ బాబు వార్తల్లో నిలుస్తున్నారు. యూట్యూబర్ కమియా జానీతో భోజనం చేస్తున్న సమయంలో ఆయన తన ‘మంచువారి పప్పు’ గురించి, రెస్టారెంట్ వ్యాపారంలోకి రావాలనే ఆలోచనను వెల్లడించారు.
Key Points
మోహన్ బాబు తన ప్రత్యేకమైన 'మంచువారి పప్పు' రెసిపీని పంచుకున్నారు.
యూట్యూబర్ కమియా జానీతో ఆయన ఇంట్లో భోజనం చేశారు.
రెస్టారెంట్ వ్యాపారంలోకి ప్రవేశించాలనే ఆయన ఆలోచనను వెల్లడించారు.
అరటి ఆకులో భోజనం చేయడం ఆయనకు చాలా ఇష్టమని తెలిపారు.
మంచువారి పప్పు రెసిపీ వైరల్
రీసెంట్ టైంలో సీనియర్ నటుడు మోహన్ బాబు ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. గత కొన్నాళ్లుగా వీళ్ల కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. కొడుకులు విష్ణు, మనోజ్ మధ్య గొడవలు జరిగాయి. ఒకరిపై ఒకరు పోలీస్ కేసులు పెట్టుకునేంత వరకు వెళ్లారు. కొన్నిరోజులుగా మాత్రం అంతా సైలెంట్ అయిపోయారు. సరే ఈ విషయాలని వదిలేస్తే మోహన్ బాబు.. తన స్పెషల్ రెసిపీ గురించి బయటపెట్టారు. ఇంతకీ ఏంటది?
యూట్యూబర్‌తో భోజనం
సెలబ్రిటీలతో ఫుడ్ వ్లాగ్స్ చేసే యూట్యూబర్ కమియా జానీ.. తాజాగా జల్‍పల్లిలోని మోహన్ బాబు ఇంటికి కూడా వచ్చింది. ఆయనతో కలిసి మధ్యాహ్న భోజనం చేసింది. ఈ క్రమంలోనే మోహన్ బాబు.. ‘మంచువారి పప్పు’ గురించి చెప్పుకొచ్చారు. అందరూ చేసే పప్పు అయినప్పటికీ తన ఇంటి పేరుని దానికి జోడించామని మోహన్ బాబు చెప్పారు. ఇప్పుడు ఈ బిట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రెస్టారెంట్ వ్యాపార ప్రణాళిక
తనకు అరటి ఆకులో భోజనం చేయడమే ఇష్టమని.. ప్రతిరోజూ సమయానికల్లా భోజనం చేసేస్తానని చెప్పుకొచ్చారు. త్వరలో రెస్టారెంట్ బిజినెస్‌లోకి వచ్చే ఆలోచన కూడా ఉందని తన మనసులోని మాటని మోహన్ బాబు బయటపెట్టారు. ఇప్పటికే సినిమా నటుడిగా, నిర్మాతగా ఈయన చాలామందికి తెలుసు. ‘శ్రీ విద్యా నికేతన్’ అని వీళ్లకు విద్యాసంస్థ కూడా ఉంది. ఇప్పుడు రెస్టారెంట్ బిజినెస్‌లోకి అడుగుపెట్టనున్నారు. మరి ఎప్పుడు ఎక్కడ ఓపెన్ చేస్తారనేది త్వరలో చెబుతారేమో?
మోహన్ బాబు సినీరంగం తో పాటు ఇప్పుడు రెస్టారెంట్ వ్యాపారంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించబోతున్నారు. తన ప్రత్యేకమైన వంటకాలతో ప్రేక్షకులను మెప్పించాలని ఆయన ఆశిస్తున్నారు.


